మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా రెడో సాంగ్ గ్లాస్ మెట్స్ అనే సాంగ్ ఖమ్మంలో ఆదివారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఖమ్మం సీక్వల్ రిసార్ట్స్ లో ఈ ఈవెంట్ జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఈ సాంగ్ క్రేజీగా ఉంది.


ఈ సాంగ్ లిరిక్స్ ఒకసారి చూస్తే.. స్కూలుకెళ్లే వరకేరా క్లాస్‌మేట్సు.. రెంటు కట్టే వరకేరా రూమ్‌మేట్సు.. వీకెండ్ వచ్చే వరకే ఆఫీస్‌మేట్సు.. లైఫ్ ఎండయ్యే వరకేరా సోల్‌మేట్సు.. ఎండ్ అంటూ లేని బెండ్ అంటూ కాని రియల్ రిలేషిప్పేప్పేప్పే.. గ్లాస్‌మేట్సు గ్లాస్‌మేట్సు గలగలగల గలగలగల గ్లాస్‌మేట్సు.. అంటూ వస్తుంది. చంద్ర బోస్ రాసిన ఈ పాట అద్భుతంగా ఉంది. 


అయితే ఈ సాంగ్ లో గ్లాస్ ను వాడటం చూస్తే జనసేనకు ప్రమోషన్ లానే ఉందని చెప్పొచ్చు. జనసేన పార్టీ గుర్తుగా గ్లాస్ వచ్చింది. ఏపి ఎన్నికల్లో తనదైన ముద్ర వేద్దామని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనకు తమ వంతు సాయంగా సినిమాలో గ్లాస్ మెట్స్ సాంగ్ చేశాడు సాయి తేజ్.


కళ్యాణి ప్రియదర్శిని, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రలహరి సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ అవుతుంది. అంటే సరిగా ఎలక్షన్స్ ముగిసిన తెల్లారే ఈ సినిమా వస్తుందన్నమాట. కొన్నాళ్లుగా ఫ్లాపుల్లో ఉన్న సాయి తేజ్ పేరు మార్చుకుని మరి చేస్తున్న ఈ చిత్రలహరి మీద భారీ హోప్స్ పెట్టుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: