ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం మా అధ్యక్షుడు నరేష్ ఎన్నిక సందర్భంగా జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు సినిమా వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. మొదట్లో తెలుగు సినిమాల్లో అక్కడక్కడా చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన కోట శ్రీనివాసరావు, ఆ తర్వాత దివంగత దర్శకుడు జంధ్యాల గారి దర్శకత్వంలో చేసిన సినిమాలతో నటుడిగా మంచి పేరు సంపాదించారు. ఆపై ఆయన అనేక సినిమాల్లో క్యారెక్టర్ నటుడిగా అలానే విలన్ గా పలు పాత్రల్లో నటిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. 

Image result for నటుడు షిండే

ఒకరకంగా టాలీవుడ్ లో విలన్ పాత్రధారి కామెడీ చేస్తూ ఎంటర్టైనింగ్ గా వ్యవహరించే విధానానికి తొలుత కోట శ్రీనివాసరావు బీజం వేశారు అని చెప్పాలి. ఇక ఒకరకంగా చెప్పాలంటే సినిమాల్లో దాదాపుగా ఆయన పోషించని పాత్ర  లేనే లేదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇకపోతే మొదటినుంచి సినిమాలకు సంబంధించిన సభలు, సమావేశాలకు కొంత దూరంగా ఉండే కోట, మన తెలుగు సినిమాల్లో పరభాషా నటులను తీసుకోవడం పై మాత్రం వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇకపోతే కొన్నాళ్ల క్రితం, ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగానే పరభాషా నటులపై తనదైన శైలిలో విరుచుకుపడిన కోట, మొన్నటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశంలో బాలీవుడ్ నటుడు శాయాజీ షిండే పై విమర్శలు చేశారు. 


ఇక ఈ విషయమై నేడు శాయాజీ షిండే సహా మరికొందరు ఇతర భాష నటులు కోట పై కఠిన చర్యలు కావాల్సిందిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు నిర్మాతల మండలిని ఆశ్రయించినట్లు సమాచారం. నిజానికి తమ వద్ద టాలెంట్ ఉంది అనే కదా టాలీవుడ్ దర్శకులు తమ వెంట పడుతున్నారు, అంతేకాని మేము ఎవ్వరినీ ఇబ్బందిపెట్టి అవకాశాలు లాక్కోవట్లేదు, అసలు అది మా తప్పు ఎలా అవుతుంది, అయినా నటుడికి భాష ప్రాంతం అనే బేధాలు ఉండవని వాళ్లు నిర్మాతల మండలి ముందు చెప్పుకువచ్చినట్లు సమాచారం. మరి ప్రస్తుతం ఇంతటి దుమారం రేపుతున్న ఈ వివాదానికి రాబోయే రోజుల్లో ఎంతవరకు తెర పడుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.....


మరింత సమాచారం తెలుసుకోండి: