సినీనటులు ఆస్తిపాస్తులెంత.. వాళ్లు ఎంత సంపాదిస్తారు.. ఇవి సాధారణ ప్రజలకు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. కానీ వాళ్లెప్పుడు తమ ఆస్తులు ప్రకటించరు కదా. కానీ కొందరు నటుల ఆస్తులు మాత్రం కొన్ని సమయాల్లో బయటపడతాయి. ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థుల తమ ఆస్తుల వివరాలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. 

prakash raj assets కోసం చిత్ర ఫలితం


ఇలా ఎన్నికల్లో పోటీ చేసే నటులు తమ ఆస్తులు తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలాగే మన ప్రకాశ్ రాజ్ ఆస్తులు కూడా వెలుగు చూశాయి. ఆయన బెంగళూరు సెంట్రల్ నుంచి పార్లమెంట్ బరిలో ఇండిపెండెంట్ గా దిగారు. ఈసీకి అఫిడవిట్ సమర్పించిన ప్రకాశ్ రాజ్.. తనకున్న మొత్తం ఆస్తుల విలువ రూ.31 కోట్లుగా ప్రకటించారు.

సంబంధిత చిత్రం

తనకు రూ.26.59 కోట్ల స్థిరాస్థులు రూ.4.93 కోట్ల చరాస్తులు ఉన్నాయని ప్రకాశ్ రాజ్‌ పేర్కొన్నారు. గత ఏడాది సమయంలో సినిమాల ద్వారా రూ.2.40 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో రూ.25వేల నగదుతోపాటు పెట్టుబడుల రూపంలో రూ.2.94 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 

prakash raj assets కోసం చిత్ర ఫలితం

అలాగే 1.88 కోట్ల విలువ చేసే వాహనాలు ఉన్నాయని తెలిపారు. భార్య రష్మి వర్మ పేరిట రూ.20.46లక్షల చరాస్తి రూ.35 లక్షల స్థిరాస్థి.. 18లక్షల విలువ చేసే ఆభరణాలున్నాయని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అంతే కాదు.. చిక్కమగళూరులో తనపై ఒక కేసు దాఖలైందని ప్రకాష్ రాజ్ అఫిడవిట్ లో తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: