పవన్ ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా చేసిన కామెంట్స్ ‘జనసేనసేన’ కు ఎంతవరకు లాభిస్తాయో తెలియకపోయినా ఆ కామెంట్స్ చాలామంది టాలీవుడ్ సెలెబ్రెటీలకు అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. తెలంగాణ ప్రాంతంలో ఆంద్ర ప్రాంతం వారికి రక్షణ లేదు అంటూ పవన్ చేసిన కామెంట్స్ పెను దుమారం సృష్టించడంతో పవన్ కామెంట్స్ పై పోసాని చిన్నికృష్ణ లాంటి సెలెబ్రెటీలు ఎదురుదాడి మొదలు పెట్టారు. 
పవన్ కళ్యాణ్ తీరుతో ఇబ్బందుల్లో సినీ స్టార్లు
దీనితో పవన్ పై మాటల దాడి చేస్తున్న టాలీవుడ్ ఫిలిం సెలెబ్రెటీలకు  సంఘీ భావం తెలియచేసి పవన్ కామెంట్స్ కు ఖండన తెలియచేయమని ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖుల పై ఒత్తిడి వస్తున్ననట్లు సమాచారం. అయితే వారు అంతా ఈ రాజకీయాలతో తమకు సంబంధం లేదని అంటూ సున్నితమైన సమాధానం ఇస్తూ తప్పించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
పవన్ కళ్యాణ్‌కు అంటీ ముట్టనట్లు...
వాస్తవానికి ఇండస్ట్రీకి సంబంధం లేని ప్రముఖులలో ఏ పార్టీ కి సంబంధం లేని వారు రాబోతున్న ఎన్నికలలో పవన్ గురించి డైరెక్ట్ గా ప్రచారం చెయకపోయినా ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ద్వారా కొందరు పవన్ కు తమ మద్దతు తెలియచేయాలని భావించి నట్లు టాక్. అయితే తెలంగాణలో ఆంధ్రా వారిని తరిమికొడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పదన వ్యాఖ్యలతో ఏపార్టీ కి చెందని చాలామంది టాలీవుడ్ ప్రముఖులు పవన్ రాజకీయాలతో  అంటీ ముట్టనట్లు వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
Jana Sena chief Pawan Kalyan’s 45 day porata yatra to start from Ichchapuram today
ఇది ఇలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన మెగా ఫ్యామిలీ సన్నిహితులు పవన్ సామాజిక వర్గానికి చెందిన కొందరు దర్శక నిర్మాతలు పవన్ ను టచ్ లోకి తీసుకుని ప్రస్తుత పరిస్థితులలో వారు అంతా పవన్ కోసం ప్రచారం చేయలేక పోయినా ‘జనసేన’ పార్టీకి నిధుల విషయంలో నాగబాబు ద్వారా సహాయం చేస్తున్నట్లు టాక్. ఇది ఇలా ఉంటే ప్రస్తతం టాలీవుడ్ ఇండస్ట్రీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ‘జనసేన’ అనే మూడు వర్గాలుగా బయటకు కనిపించకుండా అంతర్లీనంగా విడిపోయింది అన్న ప్రచారం జరుగుతోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: