తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రాంగోపాల్ వర్మ ఎన్నో చిత్రాలు అందించారు.  తాజాగా ఆయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.  ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు తీసిన చిత్రాలన్నింటిలో వివాదాస్ప చిత్రం ఏందంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్.  ఈ చిత్రం రిలీజ్ కాకముందే ఎన్నో సంచలనాలు సృష్టిస్తుంది.


ఎన్టీఆర్ జీవిత కథ..దైవసాక్షిగా అంతా నిజమే చెబుతాను అంటూ రాంగోపాల్ వర్మ ప్రారంబించిన ఈ సినిమా మొదటి నుంచి అశేష తెలుగు ప్రజలను ఆకర్షింస్తుంది. స్వఘోష-పరనిందల నేపథ్యంలో సాగిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఎన్టీఆర్ స్థాయిని పెంచకపోగా తగ్గించాయన్న అపఖ్యాతి పాలయిన నేపథ్యంలో ఈ ఎన్టీఆర్ అసలు కథ ఎన్టీఆర్ జీవితపు నిజ పార్శ్యాలను తాకుతుందని భావిస్తున్నారు తెలుగు ప్రజ. 


40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు..తెలుగు దేవం పార్టీ ఒక చిత్రాన్ని చూసి భయపడ్తుంది..ఆపడానికి ప్రయత్నిస్తుంది అని దర్శక, నిర్మాతలు చెప్పినట్లుగానే ఈ చిత్రంపై కేసులు వేయడం..విడుదల అవుతుందా?లేదా? అనే అనుమానాలు రావడం జరిగిపోయాయి. 


ఏది ఏమయినా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతుంది. ఎన్టీఆర్ ఆత్మ ఆశీస్సులతో ఘన విజయం సాధిస్తుందిని ఆర్జీవి చెప్పినట్లుగానే చిత్రం విడుదల అడ్డంకుల్ని తొలగించుకుంటుంది.  లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి ఈ రోజు ఈసి ముందు హాజరియ లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు.  మూవీ సెన్సారు సర్టిఫికెట్ ఈరోజు వస్తుందన్నారు. 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఖాయం అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: