హీరో అంటే సినిమాల్లో విలన్లను బాదేసి హీరోయిన్ తో డ్యూయట్లు పాడే వాడు కాదు, జనంలో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి గుండె చప్పుడు గా ఉన్న వాడే అసలైన హీరో అవుతాడు. మరి రీల్  హీరో కంటే రియల్ హీరో అనిపించుకోవడం కష్టం.  ఏపీ ఎన్నికల్లో అలాంటి రియల్ హీరో ట్యాగ్ ఎవరికి వస్తుంది. జనం ఎలా తీర్పు ఇస్తారు. 


సినీ జనాలు కూడా ఇపుడు ఏపీ ఎన్నికలపై ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రముఖ డైలాగ్ రైటర్ కోన వెంకట్ మీడియాతో మాట్లాడుతు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని చెప్పుకొచ్చారు. జగన్ అలుపెరగని పోరాట పటిమకు జనం బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన అన్నారు. జగన్ ఒంటరి పోరుకు ప్రజలు తగిన కానుక అందిస్తున్నారని ఆయన అన్నారు. సుదీర్ఘమైన పాదయాత్రలో జగన్ జనాలకు బాగా చేరువ అయ్యారని, ప్రతి గుండె తలుపు తట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. మే 23న ఈవీఎంలు ఓపెన్ చేస్తే చాలు జగన్ సునామీ  ఏంటన్నది బయటపడుతుందని ఆయన ధీమాగా చెప్పారు.


ఇదిలా ఉండగా పవన్ మీద సంచలన కామెంట్స్ కోన వెంకట్ చేశారు. పవన్ విద్వేషపూరితమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారని, తెలంగాణా, ఏపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని వెంకట్ అన్నారు. పవన్ ఎవరో చెప్పినది చదువుతున్నట్లుగా అనిపిస్తోందని కూడా కోన అన్నారు. పవన్ అధికారంలో ఉన్న చంద్రబాబు గురించి ఎందుకు నిలదీయరని ఆయన ప్రశ్నించారు.  జగన్ మీద టార్గెట్ చేసి విమర్శలు చేయడం తగదని కూడా ఆయన హితవు పలికారు. సినిమా వేరు, రాజకీయం వేరంటూ కోన చెప్పడమే అసలైన ట్విస్ట్.



మరింత సమాచారం తెలుసుకోండి: