గత సంవత్సరం నానీ నటించిన సినిమాలు అన్నీ పరాజయం చెందడంతో అనేక జాగ్రత్తలు తీసుకుని ‘జెర్సీ’ ని స్పోర్ట్స్ డ్రామాగా మార్చి ఈ సమ్మర్ రేస్ కు రెడీ పెడుతున్న విషయం తెలిసిందే. ఒక క్రికెటర్ ఎమోషనల్ జర్నీగా రూపొందిన ఈ మూవీ గురించి ఇప్పటికే పలురకాల కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.  
Hero Nani Jersey Movie Latest Update
తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా క్లైమాక్స్ కు సంబంధించి ఏర్పడిన కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉందని టాక్. ఈసినిమా క్లైమాక్స్ ను రెండు విధాలుగా షూట్ చేసి ఆ రెండు క్లైమాక్స్ సీన్స్ ను త్రివిక్రమ్ కు చూపెట్టినప్పుడు ఈమూవీలో హీరో చనిపోతూ ఉండే క్లైమాక్స్ బాగుందని చెప్పడంతో నాని మరింత కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయినట్లు టాక్. 

హీరో చనిపోతే సింపతీతో ప్రేక్షకులు కనెక్ట్ కావడం అనేది చిన్న హీరోల సినిమాలలో బాగుంటుంది కానీ ఇప్పటికే ఒక స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయిన తన లాంటి హీరో సినిమాలో అలాంటి క్లైమాక్స్ ను ఎంత వరకు ఒప్పుకుంటారు అన్న విషయమై నాని ఎటూ నిర్ణయించు కోలేకపోతున్నాడు అని టాక్. గతంలో నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టులో ఇలాంటి ఎండింగ్ ట్రై చేసిన నానికి నటుగా ఆసినిమా ద్వారా మంచి పేరు వచ్చింది కానీ ఆమూవీ పెద్దగా విజయం సాధించలేదు.
First look of Nani starrer Jersey out
దీనికితోడు ఈసినిమాకు సంబంధించి మ్యూజిక్ పరంగా ఏవో అద్భుతాలు చేస్తాడనుకున్న అనిరుద్ రవిచందర్ జస్ట్ ఓకే అవుట్ పుట్ ఇచ్చాడని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. దీనితో అటు ఈమూవీ పాటలు హిట్ కాక ఈమూవీ క్లైమాక్స్ విషాదంగా ఉంటే ఎంతవరకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అన్న విషయం తేలక నాని ఈమూవీ విషయంలో తీవ్ర అంతర్మధనంలో ఉన్నాడని టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: