ఇంద్ర, నరసింహనాయుడు, గంగోత్రి వంటి సూపర్ హిట్ సినిమాలకు కథా రచయితగా పనిచేసిన చిన్ని కృష్ణకు కొన్నేళ్లనుండి పెద్దగా అవకాశాలు లేవని చెప్పాలి. బుల్లితెర యాంకర్ ఓంకార్ తొలిసారి దర్శకత్వం వహించిన జీనియస్ సినిమాకు ఈయనే కథను అందించిరారు. ఆ సినిమా పెద్దగాసక్సెస్ కాకపోయినా విమర్శకుల ప్రశంశలు మాత్రం అందుకుందనే చెప్పాలి. ఇకపోతే ఏదైనా కొంత నిర్మొహమాటంగా మాట్లాడే అలవాటున్న చిన్నికృష్ణ, నిన్న మీడియాతో మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.

సినిమాల గురించే పెద్దగా తెలియని పవన్ కు రాజకీయాలపై అస్సలుఅవగాహన లేదని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఆయన సపోర్ట్ చేసి తప్పు చేసారని, టిడిపి అధికారంలోకి రావడం వలన ప్రజలందరూ ఎన్నో బాధలు పడ్డారని, చంద్రబాబు ప్రభుత్వం వల్ల చదువుకునే విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, మరీ ముఖ్యంగా ఇంజినీరింగ్ చదివే విద్యార్థులైతేఫీజ్ రి ఎంబెర్స్మెంట్ అందక చదువులు కొనసాగించలేక నానా బాధలు పడ్డారని, ఆ విధంగా వారి బాధలకు పవన్ పరోక్షంగా కారకులయ్యారని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు 60 పిల్లర్లు ఉన్న కనకదుర్గమ్మ వారధిని ఐదేళ్లలో పూర్తి చేయలేకపోయారు. 


అయితే తన కొడుకు ఒక సివిల్ ఇంజనీర్ అని, అతనికి అవకాశం ఇచ్చినా, తానే దగ్గరుండి రెండేళ్లలో ఆ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయించే వాడినని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు..అలానే జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు తిన్నారు అని, ఆయన ఒక ఆర్థిక నేరస్తుడనివైయస్ కుటుంబం పై పవన్ విమర్శలు చేస్తున్నారు. మొన్నేమో కేసీఆర్ గారు జగన్ ఆస్తి 1000కోట్లు అన్నారు. మరి ఇందులో ఏది నిజమో పవన్ కళ్యాణ్ గారే చెప్పాలని అన్నారు.

ఇక త్రివిక్రం డైలాగులు, తమిళ మరియు మలయాళ సినిమాలు రీమేకులు చేసుకునే కళ్యాణ్ కి ఏం తెలుసు జగన్ మోహన్రెడ్డి గొప్పతనం, పవనే కాదు ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర్రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వారి కుటుంబ సభ్యులపై కూడా లేనిపోని నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో సీఎం అవుతానని పవన్ పగటి కలలు కంటున్నారని, నిజానికి ఆయన జనసేన పార్టీ తరఫుననిలబెట్టిన 175 మంది క్యాండిడేట్ల లిస్టును తన వద్దకు తీసుకువస్తే అందులో గెలిచే వారు ఎందరో తానే ఈజీగా చెప్పగలను అన్నారు చిన్నికృష్ణ. 


పవన్ కళ్యాణ్ గారు ఒక ఒకటి గుర్తుపెట్టుకోవాలని,  ఈ ఎన్నికల్లో అయితే మీరు ముఖ్యమంత్రి కావటం అనేది కల అని, రాబోయేది రాజన్న రాజ్యం మరియు జగన్మోహన్రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని, ఎన్ని దృష్టశక్తులు ఎదురు వచ్చినా ఆయన విజయాన్ని మాత్రం ఆపలేరని అన్నారు. అయితేపవన్ కి మాత్రం 2024 లో గాని 2029 లో గాని  అవకాశం రావొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక పవన్ పై చిన్నికృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలకు పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికల్లో ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాటర్ ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది...


మరింత సమాచారం తెలుసుకోండి: