బుల్లితెరలో మెగా కామెడీ షోగా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన జబర్దస్త్ షో అంటే అందరికి ఇష్టమే. బిజీ లైఫ్ లో మనసుకి ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపించే జబర్దస్త్ షో అందరిని అలరిస్తుంది. ఈమధ్యనే 300 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఈటివికి మంచి టి.ఆర్.పి రేటింగ్స్ తెచ్చి పెడుతుంది.


జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు యూట్యూబ్ వ్యూస్ కూడా దుమ్ముదులిపేస్తున్నాయి. ఇక ఈ షోలో మేల్ యాక్టర్స్ తో పాటుగా ఒకరిద్దరు ఫీమేల్ యాక్టర్స్ కనిపిస్తారు. అయితే వారు జస్త్ గెస్ట్ అప్పియరెన్సెస్ మాత్రమే.. కాని ఉన్న కమెడియన్స్ తోనే లేడీ గెటప్పులు వేయించి నవ్వులు పూయిస్తున్నారు.


జబర్దస్త్ షోలో లేడీ గెటప్ లో నటించే కమెడియన్స్ ఎవరో తెలుసా.. శాంతిగా పిలవబడే శాంతి స్వరూప్.. వినోదినిగా వినోద్.. సాయి తేజాగా సాయి తేజ్.. తన్మయిగా తన్మయ్ కుమార్.. హరిణిగా హరి.. పావనిగా పవన్.. కొమరం కొమరక్కగా చేస్తున్నారు. టీం లీడర్స్ వీరిని లేడీ గెటప్ లో మాత్రమే చూపిస్తారు. 


మొదట్లో ఒకరిద్దరిని లేడీ గెటప్స్ నుండి విముక్తి కలిగించినా ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో వీరంతా పూర్తిగా లేడీ గెటప్పుల్లో మాత్రమే కనిపిస్తారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకని అలా కొనసాగిస్తున్నారు. టీం లీడర్స్ మాత్రం వారు నచ్చిన రోల్స్ చేస్తారు కాని లేడీ గెటప్పులలో వారిని మాత్రం ఒక్కసారి కూడా జెంట్స్ గెటప్పులో కనిపించే ఛాన్స్ ఇవ్వరు. మరి దానికి కారణాలేంటో వారికే తెలియాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: