బయోపిక్స్ లో ఇంత ఉత్సుకత కలిగించిన సినిమా లేదంటే ఆశ్చర్యం లేదు. కారణం ఒక మహానాయకుని జీవిత రెండు బాగాల జీవన చిత్రంలో అతి ముఖ్యమైన ఘట్టాలను మరుగున పరచటమే. అంతే కాదు ఎన్టీఆర్ కథానాయకుడులో ఆయన నిజమైన ప్రేమ కథలతో పాటు మరికొన్ని ఇబ్బందికర అంశాలను మరుగున పరచారు. ఎన్ టీఆర్ మహానాయకుడు బయోపిక్ లో జీవన చిత్రంలోని విలన్ ను హీరో చేశారు. అదీ కుటుంబ సభ్యుడే నిర్మించిన చిత్రంలో తండ్రి జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా తుంగలో తొక్కి మరోసారి చంపేశారు. అందుకే వాస్తవ జీవితాన్ని మొత్తం తెలుగు జాతి యావత్తూ ఇప్పుడు చూడాలను కొంటోంది.   
lakshmis ntr release date కోసం చిత్ర ఫలితం
అందుకే టాలీవుడ్ లో గత కొంత కాలంగా "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా ఎన్నో వివాదాల అనంతరం వర్మ సినిమా ను విడుదల చేయడానికి సిద్దమయ్యాడు. సినిమాకు సెన్సార్ బోర్డు ఊహించని విధంగా "క్లీన్ ఊ సర్టిఫికెట్" ను ఇచ్చింది. సినిమాను అన్ని వర్గాల వారు చూడవచ్చని వర్మ సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. సినిమా పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ నిర్మాతను విచారణ చేసిన అనంతరం సినిమా అన్ని సమస్యలను ధాటి థియేటర్స్ కి రాబోతున్నట్లు అర్థమైపోయింది. 


ఇక వర్మ ఎప్పటిలానే తన ప్రమోషన్స్-డోస్ ను మరింతగా పెంచేశాడు. సాధారణంగా వర్మ సినిమాలకు యూ సర్దిఫికేట్స్ రావు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఊహించని విధంగా ఊ వచ్చింది. దీంతో వర్మ కెరిర్ లో ఇదో స్పెషల్ రికార్డ్ అని చెప్పవచ్చు. 
lakshmis ntr release date కోసం చిత్ర ఫలితం
అయితే దీనికి ముందు ఏం జరిగిందంటే: లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలోని సన్నివేశాలను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వివరించామని ఆ చిత్ర నిర్మాత రాకేష్‌ రెడ్డి తెలిపారు. తన వివరణపై సీఈవో ద్వివేది సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. దివంగత ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం, వాస్తవ పరిస్థితుల ఆధారంగా సినిమా తీశామన‍్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా, రాజకీయ పార్టీలను, వ్యక్తులను కించపరిచే విధంగా తీశారన్న ఆరోపణలల్లో వాస్తవం లేదన్నారు. పసుపు జెండా లను తప్ప, పార్టీలను చూపించ లేదన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తామన్నారు. సెన్సార్స్‌ క్లియరెన్స్‌ కూడా వచ్చిందని నిర్మాత రాకేష్‌ రెడ్డి తెలిపారు.
lakshmis ntr release date కోసం చిత్ర ఫలితం 
ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం ఉందంటూ ఈసీకి ఫిర్యాదులు అందటం, చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నిర్మాత రాకేష్‌ రెడ్డి ఇవాళ ఉదయం 11గంటలకు (సోమవారం) ఎన్నికల సంఘం ఎదుట వ్యక్తిగతంగా హాజరు అయ్యారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై వస్తున్న అభ్యంతరాలపై చిత్ర నిర్మాత ఎంసీఎంసీ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. అయితే అంతకు ముందు రాకేష్‌ రెడ్డి తనకు వచ్చిన నోటీసులపై వాట్సాప్‌ ద్వారా సమాధానం ఇచ్చారు. దీనికి సంతృప్తి చెందిన ఈసీ... వ్యక్తిగతంగా కమిటీ ఎదుట హాజురు కావాలని స్పష్టం చేసింది. దీంతో రాకేశ్‌ రెడ్డి ఈసీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.

lakshmis NTR censor update

మరింత సమాచారం తెలుసుకోండి: