టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ వస్తూనే ఉంది.  అయితే వర్మ మాత్రం ఎక్కడా తగ్గకుండా తమకు నింగిన ఉన్న ఎన్టీఆర్ ఆశిస్సులు ఉన్నాయని..సినిమా విడుదలై తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.  ఈ సినిమా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉందని టీడీపీ శ్రేణులు రక రకాలుగా ఆపడానికి ప్రయత్నాలు చేశారు.  కానీ వారి ఆశలపై కోర్టు నీళ్లు జల్లింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అడ్డంకులు ఒక్కోటి తొలగిపోతున్నాయి.


ఎన్నికలు అయ్యే వరకు సినిమా విడుదల ఆపాలంటూ వచ్చిన ఫిర్యాదును ఇప్పటికే ఎన్నికల సంఘం అంగీకరించలేదు.  సినిమా విడుదల చుసుకోవచ్చని చెప్పింది. అసలు సెన్సార్ కూడా చెయ్యనని చెప్పిన సెన్సార్ బోర్డు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ చెయ్యక తప్పలేదు. ఎలాంటి అడ్డంకులు లేకుంటే ఈ నెల 22న బొమ్మ పడి ఉండేది..కానీ ఈ సినిమా 29 కి పోస్ట్ పోన్ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లఘించేలా ఉన్నాయని వచ్చిన ఫిర్యాదుపై ఈసినిమాను పరిశీలించేందకు మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటిరింగ్ కమిటి ముందు హాజరు కావాలని ఏపీ ఎన్నికల సంఘం ఆదేశించింది.


ఈ విషయమై నిర్మాత రాకేష్ రెడ్డి సోమవారం మానిటిరింగ్ కమిటీ ముందు హాజరయ్యారు.  ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఊహించని విధంగా క్లీన్ U సర్టిఫికెట్ ను ఇచ్చింది.  గతంలో అన్న ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలకు సెన్సార్ ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేయడం విశేషం.  లక్ష్మీస్ ఎన్టీఆర్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ నిర్మాతను విచారణ చేసిన అనంతరం సినిమా అన్ని సమస్యలను ధాటి థియేటర్స్ కి రాబోతున్నట్లు అర్థమైపోయింది.  ఇప్పటి వరకు వర్మ తీసిన సినిమాలకు ఎప్పుడూ యూ సర్టిఫికెట్ రాలేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఊహించని విధంగా U వచ్చింది. దీంతో వర్మ కెరిర్ లో ఇదో స్పెషల్ రికార్డ్ అని చెప్పవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: