తమిళనాడులో నయనతార వివాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నయనతార పై అసభ్యకరంగా మాట్లాడిన రాధారవికి నయనతార అదిరిపోయే రేంజ్ లో బుద్ది చెప్పింది. మహిళలను కించ పరుస్తూ, తక్కువ చేసిన మాట్లాడటాన్ని కొందరు మగతనం అనుకుంటారు అంటూ నయనతార విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా నయతార తనకు మద్దతుగా నిలిచిన వారికి థాంక్స్ చెప్పారు. నేను చాలా అరుదుగా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తుంటాను అని వ్యాఖ్యానించిన నయనతార... నా ప్రొఫెషనల్ వర్క్ గురించి కామెంట్స్ వచ్చినపుడు తనకు తానుగా స్పందించడం తన బాధ్యతగా పేర్కొన్నారు. 

తన ప్రెస్ స్టేట్మెంట్లో నయనతార ముందుగా డిఎంకె నేత ఎంకె స్టాలిన్‌కు థాంక్స్ చెప్పారు. ‘స్త్రీలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేసిన రాధా రవి లాంటి వ్యక్తులపై వెంటనే యాక్షన్ తీసుకున్నారు. మీకు నా సిన్సియర్ థాంక్స్.' అని వ్యాఖ్యానించారు. తనపై వ్యాఖ్యలు చేసిన రాధా రవి గురించి మాట్లాడుతూ... నీవు కూడా ఒక తల్లికే జన్మించావు. కానీ మీ లాంటి వ్యక్తులు మహిళను తక్కువ చేసి మాట్లాడటం మగతనం అనుకుంటారు. మీలాంటి వ్యక్తుల మధ్య బ్రతకాల్సి వస్తోంది అంటూ నయనతార ఫైర్ అయ్యారు. 

రాధా రవి లాంటి వ్యక్తులు తమ గురించి అందరూ మాట్లాడుకోవాలనే సంకుచిత ఆలోచనతో పబ్లిసిటీ కోసం ఇలా మహిళల గురించి నీచంగా, తక్కువ చేసినట్లు మాట్లాడతారు అంటూ నయనతార ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. మహిళల గురించి ఇలా తక్కువ చేసిన మాట్లాడుతున్న వ్యక్తులను కొందరు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయడం చూసి షాకయ్యాను. ప్రజలు ప్రోత్సహిస్తున్నంత కాలం ఇలాంటి వ్యక్తులు మహిళల గురించి నీచంగా మాట్లాడుతూనే ఉంటారు అని నయనతార పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: