మళయాళ ప్రేమమ్ సినిమాతో సౌత్ లో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న మలార్ అలియాస్ భానుమతి అలియాస్ రౌడీ బేబీ అదేనండి మన సాయి పల్లవి సినిమా చేసింది అంటే సినిమా హిట్టు.. పాటలు హిట్టు.. డ్యాన్స్ నంబర్ హిట్టు అన్నట్టుగా ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో బిజీ బిజీగా వరుస సినిమాలు చేస్తున్న సాయి పల్లవి ఓ తమిళ దర్శకుడితో లింక్ పెట్టారు.


కోలీవుడ్ డైరక్టర్ ఆ.ఎల్. విజయ్ సాయి పల్లవితో కణం సినిమా చేశాడు. ఆల్రెడీ అమలా పాల్ ను ప్రేమించి పెళ్లాడి ఆ తర్వాత విడిపోయారు కూడా. ఇప్పుడు ఆ దర్శకుడు సాయి పల్లవితో క్లోజ్ గా ఉంటున్నాడని ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న వార్తలు వస్తున్నాయి. పెళ్లిపై తనకు ఎలాంటి అభిప్రాయం లేదని అసలు పెళ్లి చేసుకోనని చెప్పుకొచ్చిన సాయి పల్లవి త్వరలోనే విజయ్ ను పెళ్లాడుతుందని అంటున్నారు.


అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తం ఉందో కాని.. సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. ఈ వార్తల్లో అసలు ఏమాత్రం నిజం ఉండదని.. అయితే రెండో భార్యగా వెళ్లాల్సిన అవసరం సాయి పల్లవికి ఏంటని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ తో సాయి పల్లవి రిలేషన్ ఏంటో తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు ఈ రూమర్స్ కు స్పందించాల్సి ఉంటుంది.


ఫిదాలో వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే సాంగ్ తోనే యూట్యూబ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన సాయి పల్లవి మారి 2 రౌడీ బేబీ సాంగ్ తో సరికొత్త సంచలనాలు సృష్టించింది. సాయి పల్లవితో సినిమా అంటే సాంగ్స్ పరంగా కూడా ఆడియెన్స్ లోకి బాగా వెళ్తుందని దర్శక నిర్మాతల నమ్మకం. స్వతహాగా డ్యాన్సర్ కాబట్టి సాయి పల్లవి సత్తా చూపుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: