నిన్నటితో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇక ఎన్నికల ప్రచారం తీవ్ర స్థాయికి చేరబోతోంది. ఇప్పటికే పవన్ ‘జనసేన’ కు సంఘీభావం తెలుపుతూ మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికల బరిలోకి దిగడంతో తన తమ్ముళ్ళ విజయం కోసం చిరంజీవి ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తాడు అన్న విషయమై అనేకమైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
Chiranjeevi may undergo another surgery
ఇలాంటి పరిస్థుతులలో చిరంజీవి నుండి మెగా అభిమానులకు చరణ్ అభిమానులకు ఉద్దేశించి ఒక మెసేజ్ వచ్చినట్లుగా మెగా అభిమానులలో తీవ్ర ప్రచారం జరుగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మెసేజ్ ని చిరంజీవి తనకు అత్యంత సన్నిహితుడు అయిన జాతీయ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు ద్వారా చిరంజీవి మెగా అభిమానులందరికీ షేర్ చేసినట్లు టాక్. 
మెగా ఫామిలీలో అర‌డ‌జ‌ను పైగా హీరోలు..! కాని ప‌వ‌న్ కు సంఘీభావం తెల‌ప‌ని కుర్ర‌కారు..!!
‘సపోర్ట్ అవర్ బ్రదర్’ అంటూ స్వామినాయుడు సెల్ నుండి ఈ సందేశం మెగా అభిమానులందరికి వచ్చినా ఈ మెసేజ్ వెనుక చిరంజీవి పరోక్ష హస్తం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నరసాపురం ఎన్నికల ప్రచారంలో ఉన్న నాగబాబు కూడ తమకు చిరంజీవి మద్దతు ఉంది అని మెగా అభిమానులతో చెపుతూ ఈ మెసేజ్ చిరంజీవి సూచనలతో మెగా అభిమానులకు వచ్చింది అన్న పరోక్ష సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ మూవీలో రజినీకాంత్ హీరోయిన్
ఇది ఇలా ఉండగా చిరంజీవి పరోక్ష సహకారం పై రకరకాల వార్తలు వస్తున్న నేపధ్యంలో ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కొద్ది రోజులపాటు ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలని చిరంజీవి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తన అజ్ఞాతవాసం నుండి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ చిరంజీవి తన సన్నిహితుడు స్వామినాయుడు ద్వారా తన మెగా బ్రదర్స్ విజయానికి తన వంతు సహాయం చేయడానికి ఇప్పటికే ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: