బాహుబలి ముందు దాకా ఓ తెలుగు హీరో మాత్రమే కాని ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో ఇంటర్నేషనల్ స్టార్ గా మారాడు. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. అయితే ఇప్పుడంటే ప్రభాస్ బాహుబలిగా మారాడు.. కాని చిన్నప్పుడు ప్రభాస్ ఎలా ఉండేవాడు అతని ప్రవర్తన ఎలా ఉండేదన్నది ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలా దేవి చెప్పడం జరిగింది.


ప్రభాస్ చిన్నప్పటి నుండి సిగ్గుపడే వాడు. తనకు పరిచయం లేని వ్యక్తులతో అసలు మాట్లాడేవాడు కాదు అయితే ఒక్కసారి పరిచయమైతే మాత్రం తను క్లోజ్ గా మూవ్ అవుతాడు. బాహుబలి తర్వాత వచ్చిన క్రేజ్ ను తలకు ఎక్కించుకోకుండా ఎప్పటిలానే ఉండటం చాలా గొప్ప విషయం. అది ప్రభాస్ పెదనాన్న నుండి నేర్చుకున్నారని చెప్పారు శ్యామలా దేవి.


న్యూ ఇయర్ ఈవెంట్ లో ప్రభాస్, కృష్ణం రాజు గారు కలిసి డ్యాన్స్ చేయడం.. నువ్వు సినిమాల్లోకి వెళ్లే ఇంట్రెస్ట్ ఉందా అని ఆయన అడగడం.. ప్రభాస్ తన తండ్రి సూర్యనారాయణ రాజుకి ప్రభాస్ తన ఇంట్రెస్ట్ ను చెప్పడం ఆ తర్వాత కృష్ణం రాజు గారు ప్రభాస్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్పారు. 


ప్రభాస్ ఇప్పటికి తమ ఇంటికి వచ్చాడంటే మాత్రం అసలు టైం తెలియదు.. తన చెల్లెల్లతో సరదాగా మాట్లాడుతుంటాడు. ఇక షెడ్యూల్ బిజీగా ఉన్నప్పుడు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్తుంటాడని అన్నారు. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలన్న సామెత కృష్ణం రాజు గారిని చూస్తే అర్ధమవుతుంది.. ఆ వారసత్వాన్ని ప్రభాస్ కూడా వంటపట్టించుకున్నాడని చెప్పారు శ్యామలా దేవి.


మరింత సమాచారం తెలుసుకోండి: