టాలీవుడ్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ తనయ ఆశ్రిత వివాహం ఆదివారం నాడు జైపూర్ లో ఎంతో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.   హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం జరిగింది.  ఈ వివాహ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ముఖ్యమైన అతిధులు మాత్రమే విచ్చేశారు. అయితే ఈ వివాహ వేడుక ఎంతో గోప్యంగా జరిపించిన విషయం తెలిసిందే.

అంతే కాదు మీడియాలో పెళ్లికి సంబంధించిన ఏ ఒక్క వీడియో కానీ, ఫోటోలు కానీ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు దగ్గుబాటి ఫ్యామిలీ. కానీ కొన్ని ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సల్మాన్ ఖాన్ తో రానా, వెంకటేష్... నవ దంపతులతో దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు, రాంచరణ్, ఉపాసన ఫోటోలు, వెంకి, సల్మాన్ డ్యాన్స్ ఫోటోలు ఇలా కొన్ని ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వెంక‌టేష్‌, రానా, చైతూ, సురేష్ బాబు ఇలా ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన వారంతా ఒకే ఫ్రేములో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో చూసి దగ్గుబాటి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. కాగా,  హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్‌ని వెంకీ ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం వెంకీ, చైతూ క‌లిసి వెంకీ మామ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న విష‌యం విదిత‌మే.



మరింత సమాచారం తెలుసుకోండి: