బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుసగా ఫ్లాపులు వస్తున్న సమయంలో ఓ పవర్ ఫుల్ ఆపీసర్ గా ‘దబాంగ్’చిత్రంలో నటించాడు.  ఈ చిత్రం అనుకున్నదానికన్నా ఎక్కువ లాభాలు అర్జించి పెట్టింది.  ఈ చిత్రాన్నే తెలుగు లో ‘గబ్బర్ సింగ్’ గా రిమేక్ చేశారు. గబ్బర్ సింగ్ లాంటి చిత్రంతో పవన్ కళ్యాన్ మాస్ ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది.  అయితే బాలీవుడ్ లో దబాంగ్ సీక్వెల్ దబాంగ్ 2 కూడా తీశారు.  అయితే ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.  తాజాగా ఇప్పుడు దబాంగ్ 3 కి ప్లాన్ చేస్తున్నారు.


ఈ సారి కథలో విలన్ పాత్ర రేంజ్ స్క్రీన్ పై ఎవరు ఊహించని అంచనాలతో ఉండాలని దర్శకుడు ప్రభుదేవా మంచి యాక్టర్ నే పట్టాడు.  కన్నడలో స్టార్ హీరోగా పేరున్న కిచ్చ సుదీప్ ని సంప్రదించనున్నట్లు సమాచారం. గతంలో బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో వెరైటీ రోల్స్ తో అలరించిన సుదీప్ ఈగ సినిమాతో మరింతగా పాపులర్ అయ్యాడు.


ఇప్పుడు సల్మాన్ ఖాన్ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించబోతున్నారు. మధ్య ప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. దర్శకుడు ప్రభుదేవా సల్మాన్ తో పోకిరి రీమేక్ చేసి హిట్ కొట్టాడు.  మరి ఈ బాక్స్ ఆఫీస్ కాంబో ఎంతవరకు హిట్ అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: