యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేసిన బాహుబలి రెండు భాగలతో జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ మరియు మార్కెట్ ను సంపాదించుకున్నారు అనే చెప్పాలి. ఇక బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్, తదుపరి సినిమాలు ఇకపై కూడా ఇతర భాషల్లో కూడా విడుదల కానున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన సుజిత్ దర్శకత్వంలో సాహో, అలానే రాధాకృష్ణ దర్శకత్వంలో మరొక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 


ఇకపోతే ఈ రెండు సినిమాలు కూడా అత్యంత భారీ ఖర్చుతో, అన్నిభాషల ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశాలతో రూపొందుతున్నాయట. అయితే ప్రస్తుతమ్ రూపొందుతున్న సాహోలో ప్రభాస్ ఎటువంటి రొల్ లో నటిస్తున్నాడు అనే దానిపై అటు ప్రభాస్ అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఇక నేడు కొన్ని సినీ వర్గాలు నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడట. 


అయితే ఒక పాత్రలోనే రెండు విభిన్న కోణాలున్నాయా లేక, ఒకవేళ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారా దానిపై క్లారిటీ రావలసి ఉంది. ఇక ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదుగాని, ఒకవేళ ప్రభాస్ నిజంగానే డ్యూయల్ రొల్ లో నటిస్తున్నమాట నిజమే అయితే, ఆయన అభిమానులకు కన్నుల పండుగే అని చెప్పవచ్చు. అయితే దీనిపై ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది.....


మరింత సమాచారం తెలుసుకోండి: