ఎలక్షన్ హడావిడి లో పడి సినిమాలని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పొలిటికల్ ఫీవర్ తో వచ్చే సినిమాలకే ఎక్కువ క్రేజు ఎందుకంటే సినిమా కంటే రాజకీయమే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మీదనే అందరి కళ్ళూ ఉన్నాయి. ఇన్నాళ్ళూ సెన్సార్ అడ్డం గా ఉండడం తో రామూ కంగారు పడిపోయాడు ఇప్పుడు మాత్రం అంతా చక్కగా అయ్యింది. లైన్ క్లియర్ అయ్యి రూటు మ్యాపు సిద్ధమైంది.

పొలిటికల్ జోన్ లో రాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ని టార్గెట్ చేస్తూ ఆయన మావ , తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మీద కథ కావడం తో ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా గురించి. ఇది ఎన్టీఆర్ రెండో పెళ్లి తర్వాత కథ కాకుంటే దీనికి మినిమం బజ్ కూడా వచ్చి ఉండేది కాదన్న మాట నిజం. ఇప్పుడు వర్మ సోలోగా బరిలో దిగడం లేదు.

మెగా డాటర్ నీహారిక సూర్యకాంతం అదే రోజు వస్తోంది.  సో నిహారిక కి రాం  గోపాల్ వర్మ ఇన్ డైరెక్ట్ గా ఈ  సినిమా ద్వారా వార్నింగ్ ఇచ్చినట్టు గా అయ్యింది పరిస్థితి. ఎందుకంటే పొలిటికల్ సీజన్ లో ఇలాంటి సినిమాలే చూస్తారు తప్ప సూర్యకాంతం లాంటి సాఫ్ట్ స్టోరీ లు ఎవరు పట్టించుకుంటారు అనేది ప్రశ్న !


మరింత సమాచారం తెలుసుకోండి: