హీరో హీరోయిన్ ల మీద పుకార్లు , హీరో ల పెళ్ళిళ్ళ మీద , పెళ్ళాల మీదా , హీరోయిన్ ల మొగుళ్ళ మీద పుకార్లు ఇవన్నీ ఇండస్ట్రీ లో చాలా కామన్ వ్యవహారాలు గా మారిపోయాయి. ఏ ఇండస్ట్రీ అయినా సరే గాసిప్ రాయుళ్ళ కి వండి వడ్డించడం అంటే అదొక సరదా అనిపిస్తోంది. శేఖర్ కమ్ముల ఫిదా తో తెలుగువాళ్ళని , ప్రేమం తో మలయాళం వాళ్ళనీ అభిమానులు గా చేసుకున్న సాయి పల్లవి మీద కూడా రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.

ఈమధ్య కోలీవుడ్ లో సాయి పల్లవిపై పెళ్ళి వార్తలు వస్తున్నాయి.సాయిపల్లవి కోలీవుడ్ డైరెక్టర్ ఎఎల్ విజయ్ ను త్వరలో వివాహం చేసుకోబోతోందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  అయితే ఇతను హాట్ బ్యూటీ అమలాపాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని మళ్ళీ విడిపోయిన వ్యక్తి. ఇతనితో సాయి ప్రేమలో పడింది అంటూ మాటలు వినపడుతున్నాయి.  సాయి పల్లవి లీడ్ రోల్ లో నటించిన 'కణం' సినిమాకు దర్శకుడు గా కూడా చేసాడు ఇతను.

సాయి పల్లవి - విజయ్ ల పెళ్లి త్వరలో ఉంటుంది అంటూ పుకార్లు వస్తున్నా వారిద్దరి నుంచీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ వార్తలపై అప్సెట్ అయిన సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఇవన్నీ గాసిప్స్ అని కొట్టిపారేస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూ లో మాత్రం సాయి పల్లవి అసలు జన్మలో పెళ్లి చేసుకోను మొర్రో అంటూ సమాధానం చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: