తమిళ స్టార్ సూర్య, గత కొంతకాలంగా సరైన హిట్ లేక కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య ఇటీవల హరి దర్శకత్వంలో ఆయన చేసిన సింగం 3 సినిమా కూడా పెద్దగా ఆడకపోవడంతో, ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటూ తదుపరి విడుదల కానున్న ఎన్జీకే, కప్పన్ సినిమాల పైనే ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సూర్య మార్క్ వెరైటీ కథలతో రూపొందుతున్న ఆ రెండు సినిమాలు పూర్తిగా విడుదల తరువాతనే ఎంతవరకు హిట్టవుతాయనేది చెప్పగలం. ఇకపోతే ఈ రెండు సినిమాల తరువాత సూర్య, మాస్ మరియు కమర్షియల్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నాడు. తెలుగులో గోపిచంద్ తో శంఖం, శౌర్యం సినిమాలు తీసిన శివ, అవి పెద్దగా ఆడకపోవడంతో ఆపై తమిళ ఇండస్ట్రీకి వెళ్ళాడు. 


ఇక అక్కడ అజిత్ తో ఏకంగా నాలుగు సినిమాలు తీసి, అజిత్ కి కెరీర్ పరంగా మంచి కమర్షియల్ సక్సెస్ లు అందించడంలో  శివ కీలకపాత్ర పోషించాడనే  చెప్పాలి. ఇక కొద్దిరోజుల క్రితం సూర్యని కలిసిన శివ, ఆయన కోసం సిద్ధం చేసిన ఒక కథను వినిపించాడట. అది సూర్యకి బాగా నచ్చడంతో తను ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు పూర్తి అయిన వెంటనే చేద్దాం అని మాటిచ్చాడట. ఇక ఈ సినిమా కూడా శివ, గత చిత్రాల మాదిరి మంచి ఆకట్టుకునే కథాంశంతో సాగడంతోపాటు, సూర్య ఫాన్స్ తమ అభిమాన హీరో నుండి ఎప్పటినుండో కోరుకుంటున్న అన్ని యాక్షన్, మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండనున్నాయట.  


ఇక ఒక బడా సినీ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా తాలూకు పూర్తి వివరాలు అతి త్వరలో ఒక అధికారిక ప్రకటన ద్వారా  ఇడుదల చేయనున్నారట. అయితే చాలా ఏళ్ల తరువాత సూర్య నటిస్తున్న పూర్తి కమర్షియల్ సినిమా కావడంతో, అందరిని ఆకట్టుకునే  విధంగా శివ ఈ సినిమాను రూపొందించినట్లైతే సూర్య కెరీర్ లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: