విలన్.. క్యారక్టర్ ఆర్టిస్ట్ చరణ్ రాజ్ ఎవరో ఇప్పటి ఆడియెన్స్ కు తెలియడం కష్టమే.. 90లలో చాలా సినిమాల్లో నటించి మెప్పించిన చరణ్ రాజ్ కన్నడలో కూడా మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో చాలా సినిమాల్లో నటించిన చరణ్ రాజ్ టాలీవుడ్ స్టార్ హీరోస్ మహేష్, ప్రభాస్ ల మధ్య తేడా ఏంటో చెప్పాడు.     


కృష్ణం రాజు మంచి వారు.. భోజన ప్రియుడు.. ఆయన సినిమాలో నటిస్తే తోటి నటీనటులు అందరికి లంచ్ వాళ్ల ఇంటి నుండి వస్తుంది. చేపల దగ్గర నుండి అన్ని వెరైటీస్ వస్తాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా ఆ పద్ధతి ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది. కృష్ణం రాజు లానే ప్రభాస్ కూడా మంచి మనసు కలిగిన వ్యక్తి అని.. బాహుబలితో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడని అన్నారు.


ప్రభాస్ తో సినిమా ఛాన్స్ వస్తే తాను తప్పకుండా నటిస్తానని చెప్పారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో తాను నటించడం జరిగిందని.. ఆయన చిన్నప్పుడు నటించిన సినిమాల్లో కూడా తాను చేశానని.. అతడు సినిమాలో తనని చూసి స్క్రీన్ పై చాలా బాగున్నారని అన్నాడని చెప్పారు. మహేష్ బాబు డైరక్టర్స్ హీరో.. రజినికాంత్ తర్వాత దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఇచ్చే వారిలో మహేష్ ఉంటాడు. 


మహేష్ నిజమైన ప్రిన్స్ అని.. అతని అందం ముందు మగవాళ్లమైన తమకే ఏదోలా ఉంటుందని అన్నారు. అంత పెద్ద స్టార్ అయినా డౌన్ టూ ఎర్త్ మనిషని.. అందుకే ఆయనకు అంత స్టార్ డం అన్నారు చరణ్ రాజ్. తెలుగులో మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని.. కన్నడలో రాజ్ కుమార్ తో.. తెలుగులో సీనియర్ ఎన్.టి.ఆర్ తో చేయాలన్న కోరిక తీరలేదని చెప్పుకొచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: