ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో విజయ్ దేవరకొండ హవా బీభత్సంగా ఉంది. అర్జున్ రెడ్డి సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ దేవరకొండ చేతి నిండా సినిమాలు అవకాశాలను అందిపుచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లను సృష్టిస్తున్నాడు.

Image result for surya vs vijaydevarakonda

ఈ నేపథ్యంలో తాజాగా భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా సమ్మర్ కానుకగా మే 31వ తారీకున విడుదల అవుతున్న నేపథ్యంలో...తెలుగు లోను మరియు తమిళంలోనూ తెరకెక్కిన ఈ సినిమా మే 31వ తారీకున రెండు భాషలలో విడుదల చేయటానికి సినిమా యూనిట్ ముందే నిర్ణయించుకున్నారు.

Image result for surya vs vijaydevarakonda

ఇదిలా ఉండగా పెద్ద సినిమాలేవీ దగ్గరలో లేకపోవడం .. 'డియర్ కామ్రేడ్'కి కలిసొచ్చే అంశమని అనుకున్నారు. అయితే అనుకోకుండా 'ఎన్జీకే' వచ్చి ఇదే డేట్ ను ఫిక్స్ చేసుకుంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చి, ఈ తేదీని ఖరారు చేసుకుంది. తమిళనాట సూర్యకి గల క్రేజ్ గురించి తెలిసిందే.

Related image

అందువలన విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' కి ఈ సినిమా గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోపక్క సినిమా హాలు ల విషయంలో ఈ రెండు సినిమా యూనిట్లకు కొంత మాట తేడా వచ్చిన నేపథ్యంలో పరిస్థితి నువ్వా నేనా అన్నట్టుగా యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నట్లు రెండు ఇండస్ట్రీలో టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: