ఖమ్మంలో జరిగిన చిత్రలహరి సినిమా సాంగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్ సునీల్.. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. సాధారణంగా సునీల్ అంటే కామెడీ అనుకుంటారు. తమాషా చెబుతాడని భావిస్తారు. కానీ ఈ సినిమా సాంగ్ లాంచ్ కార్యక్రమంలో సునీల్ కొన్ని అద్భుతమైన జీవిత సత్యాలు ప్రేక్షకులకు వివరించారు. 


సునీల్ ఏమ్ననాడంటే.... నా లైఫ్‌లో నేను మ‌ర్చిపోనిది చిత్రల‌హ‌రి. విడుద‌లైన సినిమాల్లోని పాట‌ల‌ను కొంచెం కొంచెం అందులో వేసేవారు. అప్పుడు మా మాస్టర్ అనేవాడు వీడు పొద్దున్నే, మ‌ధ్యాహ్నం స్కూల్‌కి రావ‌డం లేదు. కానీ శుక్రవారం సాయంత్రం పాట‌ల టైమ్‌కి వ‌స్తాడు అప్పుడు క్యాచ్ చేయాలి అనుకునేవారు ఆయ‌న‌.

 వాళ్లింట్లో టీవీ ఉండ‌టం వ‌ల్ల అలా వెళ్లేవాడిని. కాక‌పోతే ఎగ్జామ్స్ ముందు క‌ష్టప‌డి చ‌దివి సెకండ్ క్లాసులో పాస్ అయ్యేవాడిని. అంద‌రూ ఏదైతే క‌ష్టమ‌నుకుంటారో అదే సుఖం. ఏదైతే సుఖ‌మ‌నుకుంటారో అదే క‌ష్టం. వారం రోజులు బాగా తిని, ఏసీ రూమ్‌లో ప‌డుకుంటే.. బాబూ నీకు షుగ‌ర్ వ‌చ్చింది అని అంటాడు. 

ఎక్కువ తినొద్దని అంటాడు. అంటే మ‌నం సుఖ‌ప‌డ్డందుకు వ‌చ్చిన క‌ష్టం అది. అదే మ‌నం బాగా క‌ష్టప‌డి కాస్త నీర‌సంగా అనిపించి డాక్టర్ ద‌గ్గరికి వెళ్లామ‌నుకోండి. బాగా తినండి అని చెడుతాడు. న‌చ్చింది తిన‌మంటే సుఖ‌మే క‌దా.. అలా ఎప్పుడూ క‌ష్టప‌డితే సుఖం ఉంటుంద‌ని అర్థం చేసుకోవాలి అంటూ చిన్నపాటి పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాస్ ఇచ్చాడు సునీల్. నిజమే కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: