ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్న ఎన్నికలు పవన్ ఇమేజ్ కి పరీక్షగా మారడంతో రానున్న ఎన్నికలలో పవన్ కు ఎన్ని స్థానాలు వస్తాయి అదేవిధంగా ఎంత శాతం ఓట్లు తెచ్చుకుని పవన్ తన స్టామినాను చూపెడతాడు అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ‘జనసేన’ కూడా రెండు ప్రధాన పార్టీలకు ధీటుగా పలుచోట్ల అభ్యర్థులను ఖారారు చేయడంతో పోటీ ముక్కోణంగామారడంతో ‘జనసేన’ కు పడే ఓట్లు ఏప్రధాన పార్టీ విజయ అవకాశలకు గండి కొడుతుంది అన్న  విషయమై అనేక అంచనాలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో మెగా అభిమానులు అంతా చిరంజీవి తన తమ్ముళ్ళ పై అనుసరించబోయే వ్యూహాల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో చిరంజీవి సామాజిక వర్గ ఓట్లు కీలకం కావడంతో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా చిరంజీవి తమకు ఇచ్చే సూచనలను గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

తెలుస్తున్న సమాచారం మేరకు గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కాపు సంఘ నేతలు చిరంజీవిని వ్యక్తిగతంగా కలవాలని ప్రయత్నాలు చేసినా చిరంజీవి స్పందించడం లేదు అని తెలుస్తోంది. దీనికితోడు కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఒక ప్రముఖ వ్యక్తి ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు వెళ్ళినప్పుడు ఆ విషయం తెలుసుకుని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు మెగా అభిమానులు ఆ పెళ్ళిలో చిరంజీవిని కలిసి పవన్ ఎన్నికల ప్రచారం పై తన అభిప్రాయం చెప్పమని గట్టి అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

దీనితో చిరంజీవి ఎదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే కొందరు ఆ విషయాలను తమ సెల్ ఫోన్స్ లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించడంతో అసహనానికి లోనైన చిరంజీవి ఆ పెళ్ళి వేడుకల నుండి ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయినట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ సంఘటనతో షాకి అయిన చిరంజీవి ఈ ఎన్నికలు అయ్యే వరకు ఎటువంటి ఫంక్షన్స్ కు వెళ్ళకూడదు అని స్థిర నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇప్పుడు ఈ వార్తలు వైరల్ కావడంతో పవన్ విషయంలో చిరంజీవి మౌనానికి మెగా అభిమానుల అత్యుత్సాహం కారణమా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ సందడి చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: