తమిళ నటుడు విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. అసలేమాత్రం అంచనాలు లేకుండా రిలీజైన బిచ్చగాడు తెలుగులో భారీ హిట్ నమోదు చేసుకుంది. అప్పటి నుండి విజయ్ ఆంటోని సినిమాలకు తెలుగులో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. విజయ్ ఆంటోని అంతకుముందు నటించిన సినిమాలను చూసేందుకు ఇంట్రెస్టింగ్ చూపించారు.


బిచ్చగాడుతో వచ్చిన క్రేజ్ తో విజయ్ తను నటిస్తున్న ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. బిచ్చగాడు తర్వాత బేతాళుడు, యమన్, ఇంద్రసేన, కాశి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. విజయ్ ఆంటోని యాక్షన్ కింగ్ అర్జున్ కలిసి నటించిన సినిమా కిల్లర్.


ఈ సినిమాను లూయిస్ ఆండ్రూ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా స్నీక్ పీక్ గా 2 నిమిషాల సినిమా రిలీజ్ చేశారు. విశాఖ బీచ్ ఒడ్డున ఓ గుర్తుపట్టలేని విధంగా ఓ డెడ్ బాడీ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ అర్జున్ అక్కడకు వెళ్లి కేసు డీటైల్స్ తెలుసుకుంటాడు. కట్ చేస్తే కిల్లర్ గా విజయ్ ఆంటోని కనిపిస్తాడు. కథ తెలిసిందే అనిపించేలా ఉన్నా హీరో అసలు ఎందుకు కిల్లర్ గా మారాడు అన్నది సినిమాలో చూడాల్సిందే.


తన ప్రతి సినిమాకు ఇలా 2 నిమిషాల సినిమాను ముందే వదిలి సినిమా మీద ఓ హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు విజయ్ ఆంటోని. థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు ఒకేసారి రాబోతుంది. అయితే ఈ 2 నిమిషాల టీజర్ లోనే తమిళ నేటివిటీ ఎక్కువ కనిపిస్తుంది. మరి మన తెలుగు ఆడియెన్స్ కు ఈ కిల్లర్ నచ్చుతాడో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: