సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రముఖ క్యారెక్టర్ నటి కల్యాణి కొన్ని షాకింగ్ వాస్తవాలు ఓ ఛానళ్లో పంచుకున్నారు. సినీ ఇండస్ట్రీలో కొందరికి అమ్మాయిల పిచ్చి ఉంటుందని.. అలాంటి వాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కొత్తగా వచ్చే వారికి జాగ్రత్తలు చెప్పారు. 


కొందరు అమ్మాయి ఎంత అందవికారంగా ఉన్నా కూడా వదలరు. మగాళ్లు అలా ఉన్నారు. వాళ్లలో ఓ ఫీల్ ఉంది. అందుకే ఆ టైమ్ కోసం ట్రై చేస్తుంటారు..  ఆ టైమ్ అమ్మాయిలు స్ట్రాంగ్‌‌గా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొత్త వారికి సలహా ఇస్తోంది కల్యాణి. 


ఎవరైనా.. నీ అవసరం గుర్తించి ఎవరైనా ఆఫర్ ఇస్తానంటే.. ఎప్పుడు రమ్మంటారు సార్ అని అంటే.. నేను ఎప్పుడూ రెడీనే వచ్చెయ్ అంటారు. అందుకే ముందు మీరు ఎలాంటి వారో వారికి అర్థమయ్యేలా చెప్పండి.. అని చెబుతోంది కల్యాణి. 


అంతేకాదు..సినిమా ఇండస్ట్రీలో మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ ఉందంటే తాను ఒప్పుకోనని.. ఆడవాళ్ళు పనిచేసే ప్రతి చోటా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయన్నారామె. సాప్ట్‌వేర్‌ ఫీల్డ్‌లో చేతులు వేసినా.. హగ్ చేసినా కిస్ చేసినా చాలా ఈజీగా తీసుకుంటారని వివరించింది కల్యాణి. 



మరింత సమాచారం తెలుసుకోండి: