బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్ మాజీ భార్య బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా ప్రస్తుతం అర్జున్ కపూర్ తో నిండా ప్రేమ లో ఉందని బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వార్తలు వినపడుతున్నాయి. అర్బన్ ఖాన్తో విడాకులు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ..గత కొంత కాలం నుండి అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తూ బయట అప్పుడప్పుడు అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కొత్తజంట...త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.

Image result for malaika arora arjun kapoor

అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య బంధం బలమైన క్రమంలో ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నా క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయినట్లు టాక్ వినపడుతుంది. మరోపక్క అర్జున్ కంటే మలైకా ఏకంగా పదిహేనేళ్లు పెద్దది.

Related image

ఏప్రిల్ 19న వీరి పెళ్లి జరగబోతుందని… అది కూడా కొద్దిమంది స్నేహితులు, బాగా క్లోజ్‌ అయిన సినిమా వాళ్ల మధ్యన చాలా సింపిల్ గా జరగనుంది. మరి వీరి పెళ్లికి అర్జున్ కపూర్ వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారో లేదో తెలియాలి.  ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: