తెల్లారితే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా రిలీజ్.. ముందునుండి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా డైరెక్ట్ గా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఆర్జివి తీశాడని టీజర్, ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అసలే ఎన్నికల టైం.. ఇలాంటి టైంలో ఈ సినిమా టిడిపికి బాగా దెబ్బేస్తుందని తెలుసు.


అయినా సరే వర్మ ఎంత రెచ్చిపోతున్నా సైలెంట్ గా ఉన్న బాబు కరెక్ట్ టైంకి దెబ్బ వేశాడు. సరిగా రేపు రిలీజ్ అనగా ఈరోజు ఆ సినిమా ఎలక్షన్స్ పూర్తి అయ్యేదాకా రిలీజ్ వాయిదా వేయాలని అదికూడా ఏప్రిల్ 3న లాయర్స్ తో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన తర్వాత డిసైడ్ చేస్తామని ఏపి హై కోర్ట్ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై స్టే విధించింది.


ఈరోజు ఉదయం కూడా తాను భీమవరంలో పవన్ కు పోటీగా నిలబడుతున్నా అని.. దాని డీటైల్స్ త్వరలోనే పెడతానని చెప్పి కొద్ది గంటలకే ఏప్రిల్ ఫూల్ ఇన్ అడ్వాన్స్ అన్నాడు ఆర్జివి. అచ్చం అలానే వర్మ ఎంత రెచ్చిపోతున్నా సరే సినిమా రిలీజ్ టైంకు కరెక్ట్ గా తన పనితనం చూపించాడు చంద్రబాబు. ఆయన స్టైల్ లోనే అడ్వాన్స్ గా ఆర్జివిని ఏప్రిల్ ఫూల్ చేశాడు చంద్రబాబు. 


రేపు (శుక్రవారం) రిలీజ్ ప్లాన్ చేసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇది కేవలం ఏపి వరకే వాయిదా పడనుంది. తెలంగాణా మిగతా ఏరియాల్లో రిలీజ్ కు ఎలాంటి అడ్డంకులు లేవు. చివరి నిమిషంలో వర్మ ఈగో హర్ట్ అయ్యేలా చేసిన బాబుని అంత తేలికగా వదిలిపెడతాడా అన్నది వేచి చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: