ఎన్.టి.ఆర్ జీవితంలోని అసలు కథను.. చివరి రోజుల్లో ఆయన అనుభవించిన బాధను తెర మీదకు తెచ్చే ప్రయత్నంగా సంచలన దర్శకుడు ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా తెరకెక్కించారు. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చాక ఆయన పరిస్థితి ఎలా మారింది అన్నది సినిమాలో చూపించనున్నారు.


అయితే మొదటి నుండి ఈ సినిమా చంద్రబాబుకి వ్యతిరేకంగా తీస్తున్నారన్న టాక్ ఉంది. మాములుగా అయితే చంద్రబాబు పట్టించుకునే వాడు కాదేమో కాని సరిగ్గా ఎలక్షన్స్ టైం కాబట్టి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై అందరి ఫోకస్ ఏర్పడింది. సినిమా రిలీజ్ అయితే కచ్చితంగా తమకు నష్టమని భావించిన టిడిపి శ్రేణులు చివరి నిమిషంలో సినిమాపై కోర్టులో పిటీషన్ వేయడం సినిమా రిలీజ్ ఆగడం జరిగింది.


ఇదిలాఉంటే ఏపిలో తప్పించి తెలంగాణా, ఇంకా ప్రపంచవ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. కొద్ది నిమిషాల క్రితం ఆర్జివి తన ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెళ్లడించారు. ఇక దీనిపై సుప్రీం కోర్ట్ కు వెళ్లనున్నట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 


మరి వర్మ ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు. ఏపిలో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ కు వర్మ ఏం ప్లాన్ చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. సినిమా రిలీజ్ నాడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే కచ్చితంగా వర్మ ఏదో పెద్ద స్కెచ్ వేసే ఉంటాడని అంటున్నారు. అదేంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.



మరింత సమాచారం తెలుసుకోండి: