పవన్ కళ్యాణ్ ‘జనసేన’ అభ్యర్ధుల కోసం ప్రచారం చేస్తూ తాను పోటీ చేస్తున్న నియోజక వర్గాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు పవన్ కు వార్నింగ్ బెల్స్ గా మారుతున్నాయా అంటూ జనసైనికులు అభిప్రాయ పడుతున్నారు. రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవన్ గాజువాక భీమవరం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు నియోజక వర్గాలలోను ఎన్నికల తేదీ సమీపిస్తున్నా ఎక్కడా ప్రచారం ఊపు అందుకోకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

దీనితో పవన్ ఈ రెండు నియోజక వర్గాలలోను తన గెలుపు ఖాయం అనుకుని మితిమీరిన ఆత్మ విశ్వాసంతో తప్పటడుగు వేస్తున్నాడా అంటూ పవన్ వీరాభిమానులు కూడ టెన్షన్ పడుతున్నారు. వాస్తవానికి పవన్‌ సామాజిక వర్గం ఓట్లు భీమవరం నియోజకవర్గంలో 70 వేలకు వరకూ ఉంటే అదే విధంగా గాజువాకలో 55 వేల వరకూ ఉన్నాయి అని గణాంకాలు చెపుతున్నాయి. దీనికితోడు ఈ రెండు నియోజక వర్గాలలో పవన్ అభిమానులు అన్ని సామాజిక వర్గాలలోను వేల సంఖ్యలో ఉన్నారని పవన్ నమ్మకం అని అంటున్నారు. 

అయితే ఈ రెండు నియోజక వర్గాలలోను ‘జనసేన’ కు సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు ఎవ్వరూ లేకపోవడంతో కేవలం పవన్ అభిమానులు మాత్రమే తమ నాయకుడుకు ఓట్లు వేయండి అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ ఆ ప్రచార స్థాయి ఏమాత్రం సరిపోదు అన్న విశ్లేషణలు వస్తున్నాయి. దీనికితోడు ఈ స్థానాలలో పోటీ చేస్తున్న తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధులు జనం మధ్య తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.  

పవన్ ఈ రెండు స్థానాలలో గెలిస్తే ఇక్కడ రాజీనామా చేస్తారంటే ఇక్కడ రాజీనామా చేస్తారు అంటూ ఒక విధమైన నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టి పవన్ పట్ల అక్కడ స్థానిక ఓటర్లలో నమ్మకం పోయేట్లుగా చేస్తున్న ప్రయత్నాలు పవన్ పట్టించు కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనితో ఈ విషయాల పై పవన్ వెంటనే దృష్టి పెట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే ఈ రెండు నియోజక వర్గాలలోను పవన్ కు ఎదురుగాలి మొదలై అసలకు మోసం వస్తుందని పవన్ అభిమానులు తమ అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు రావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: