‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు సంఘటనలను యదార్ధంగా చూపెడతాను అంటూ వర్మ చేసిన ప్రచారం వల్ల ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వాస్తవానికి ఈసినిమా విడుదలను కోర్టు ద్వారా అడ్డుకుంటారు అన్న ప్రచారం జరిగినా కేవలం విడుదలకు కొద్దిగంటల ముందు ఈమూవీ విడుదలను నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలు రాబట్టడం వెనుక పెద్ద వ్యూహాలే నడిచాయని వార్తలు వస్తున్నాయి.  

ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్న కామెంట్స్ ప్రకారం ఈ స్టే ఈమూవీ విడుదలకు రెండు మూడు రోజుల వ్యవధి ఉండగా వచ్చి ఉంటే వర్మ సుప్రీమ్ కోర్టుకు వెళతాడు అన్న ఉద్దేశ్యంతో ఆఖరి నిముషంలో ఈ స్టే వచ్చేలా వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈసినిమాకు ఏర్పడ్డ క్రేజ్ తో అడ్వాన్స్ టిక్కెట్లు కూడ అమ్మిన తరువాత ఈమూవీ వాయిదా పడిన నేపధ్యంలో కొంత గ్యాప్ తో ఈసినిమా విడుదల అయినా ఆతరువాత ఆసినిమాకు టాక్ బాగున్నా ఆదరణ ఉండదు అన్న ప్రచారం జరుగుతోంది. 

అయితే కోర్టు ఆంక్షల వల్ల ఈమూవీ ఆంధ్రప్రదేశ్ లో విడుదల అవ్వకపోయినా తెలంగాణ ఓవర్సీస్ ప్రాంతాలలో విడుదల అవ్వుతున్న నేపధ్యంలో ఈమూవీ వల్ల జరిగే డ్యామేజ్ ని కొంతవరకు కంట్రోల్ చేయగలరు కానీ పూర్తిగా నష్ట నివారణ చేయలేరు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ శాసిస్తున్న రోజులలో టాప్ హీరోల సినిమాలు కూడ వెంటనే పైరసీకి గురవ్వుతున్నాయి. అంతేకాదు ఫేస్ బుక్ లైవ్ లు కూడ పెట్టేస్తున్నారు. 

ఇక ఈసినిమాలోని ముఖ్య సన్నివేశాల క్లిపింగ్ లు వాట్సప్ ల్లోకి వచ్చేస్తున్న పరిస్థుతులలో ఈమూవీ చేసే డ్యామేజ్ ని ఎంతవరకు అడ్డుకట్ట వేయగలరు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నడుస్తున్నది ఎన్నికల కాలం కాబట్టి తెలుగుదేశం వ్యతిరేక వర్గాలు ఈమూవీ పైరసీ సీడీల గురించి ప్రత్యేక శ్రద్ధపెట్టి ఆంధ్రప్రదేశ్ లో అందరికీ అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నాలు జరిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఏమైనా వర్మకు జరిగిన ఊహించని ఎదురుపోటు సంఘటనలతో ఈ పరిస్థుతులలో వర్మ మరింత రెచ్చిపోయే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: