టాప్ యంగ్ హీరోలు తాము నటించే సినిమా కథల ఎంపిక విషయంలో అదేవిధంగా దర్శకుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. అయితే ఈవిషయంలో అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరు మరీ మితిమీరినట్లుగా మారింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో కథలు వినిపించడానికి అల్లు అర్జున్ కాంపౌండ్ కు వెళ్ళడానికి కూడ దర్శకుడు భయపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

త్రివిక్రమ్ బన్నీల కాంబినేషన్ లో ప్రారంభం కావలసిన మూవీ ఆలస్యం గురించి ఆమూవీ నిర్మాతలు వివరణ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ విషయంలో ఎడతెరిపి లేకుండా జరుగుతున్న చర్చలు వల్ల ఈమూవీ ప్రారంభం ఆలస్యం అవుతోందీ అంటూ ఓపెన్ గా ప్రకటన ఇచ్చారు అంటే బన్నీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అర్ధం అవుతుంది.  

ఈ మూవీ విడుదల అయిన వెంటనే సుకుమార్ తో సినిమా చేస్తాను అని బన్నీ మాట ఇవ్వడంతో ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ ను దృష్టిలో పెట్టుకుని మహేష్ కోసం వ్రాసిన కథలో అనేక మార్పులు చేస్తున్నాడు. అయితే ఈ మార్పులు అన్నీ బన్నీకి నచ్చి ఈమూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో సుకుమార్ కే తెలియని పరిస్థితి అని అంటున్నారు. 

ఇది చాలదు అన్నట్లుగా దర్శకుడు వేణు శ్రీరామ్ సుమారు సంవత్సరం పాటు ఆలోచించి రెడీ చేసిన కథకు అల్లు అర్జున్ ఓకె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాను దిల్ రాజ్ నిర్మిస్తాడు అని అంటున్నారు. అయితే ఈమూవీ వచ్చే సంవత్సరం అయినా మొదలవుతుందా అన్న విషయంలో క్లారిటీ లేదు. ఇది కాకుండా మరో ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ చెప్పిన కథలను కూడ బన్నీ ఓకె చేసాడు అని అంటున్నారు. ఈసినిమాలన్నీ ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తి అవుతాయో అసలు బన్నీకి అయినా క్లారిటీ ఉందా అంటూ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పై సెటైర్లు  పడుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: