వివాదాలకు చిరునామాగా మారిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకపోయినా మిగతా చోట్ల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన నేపధ్యంలో ఈమూవీకి సంబంధించిన ఓవర్సీస్ టాక్ బయటకు వచ్చింది. ఈమూవీని ఇప్పటికే చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు ఈమూవీ పై వ్యక్తపరిచిన అభిప్రాయాలను బట్టి ఈమూవీకి కూడ డివైడ్ టాక్ వస్తుందా అన్న అనుమానం కలుగుతోంది. 

ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన నాటినుండి సంఘటనలను చూపెడుతూ మొదలైన ఈమూవీలో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతుల ఫ్యామిలీ బాండింగ్ పై ఎక్కువ ఫోకస్ వర్మ పెట్టినట్లు తెలుస్తోంది. ఒక పొలిటికల్ డ్రామాను ఫ్యామిలీ స్టోరీగా మార్చి వర్మ ఒక సరికొత్త పద్దతికి ఈమూవీ ద్వారా శ్రీకారం చుట్టాడు అనీ ఈమూవీ చూసి వచ్చిన ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. 

ముఖ్యంగా లక్ష్మీ పార్వతిగా యజ్ఞశెట్టి అద్భుతమైన నటన ప్రదర్శించింది అని ఈమూవీ చూసిన ప్రేక్షకులు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈసినిమా ముంగింపు షాక్ అయ్యేలా ఉందనీ అంతేకాకుండా ఈమూవీ క్లైమాక్స్ చూసిన వారికి ఎవరికైనా కన్నీళ్లు వస్తాయని ఈమూవీ క్లైమాక్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈసినిమా స్క్రీన్ ప్లే విషయంలో వర్మ తన అద్భుతమైన తెలివితేటలు ఉపయోగించాడనీ ఇలాంటి సినిమా తీయగల సమర్ధత ఒక్క వర్మకు మాత్రమే ఉంది అంటూ
ఓవర్సీస్ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

అయితే మరికొందరు మాత్రం ఈమూవీ బోరింగ్ గా ఉందనీ అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ వర్మ చెప్పాడని తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడును వ్యతిరేకించే వారికి కూడ ఈసినిమా నచ్చదు అంటూ ఈసినిమాకు తక్కువ స్టార్ రేటింగ్స్ ఇస్తున్నారు. అయితే ఈసినిమా ఎన్నికల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల కోసం తీసిన పరిస్థుతులలో అక్కడ ఈమూవీ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థుతులలో ఈమూవీని ఆంధ్రపదేశ్ ప్రజల ముందుకు తీసుకు వెళ్ళడానికి వర్మ చాల వ్యూహాలు రచించ వలసి ఉంటుంది.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: