మహేష్ కు మే నెల సెంటిమెంట్ కలిసిరాకపోవడంతో అదే నెలలో విడుదల కాబోతున్న ‘మహర్షి’ గురించి అభిమానులలో చాలభయాలు ఉన్నాయి. అయితే ఆభయాలను పోగొడుతూ ‘మహర్షి’ ఈరోజు తొలి పరీక్షలో విజయం సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమూవీకి సంబంధించిన మొదటి పాట ‘చోటే చోటే బాతిన్’ కొద్ది సేపటి క్రితమే విడుదలైన ఈపాట అభిమానులకు మాత్రమే కాకుండా అందరికీ బాగా నచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

స్నేహంలోని గొప్పతనాన్ని వివరిస్తూ ఆ స్నేహంలోని మాధుర్యాన్ని తెలియచేసే విధంగా ఈపాట ఉంది. కాలేజీ రోజులలోని ముగ్గురు స్నేహితుల జీవన ప్రయాణాన్ని వివరిస్తూ స్నేహం నేపధ్యంలో కొనసాగిన ఈపాట ట్యూన్ కూడ మంచి మెలోడీగా ఉంది. ముఖ్యంగా దేవీశ్రీప్రసాద్ ఈమధ్య కాలంలో సరైన ట్యూన్స్ ఇప్పవడం లేదు అని విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఆ విమర్శలకు సమాధానంగా ఈ పాట ఉంది. 

ముఖ్యంగా పాటల రచయిత శ్రీమణి అందించిన పదాల మాయ ప్రతి వ్యక్తికి తన కాలేజీ డేస్ గుర్తుకు వచ్చేలా చేస్తుంది. ఈపాటను బట్టి నేటి యూత్ కోరుకునే యూత్ ఫుల్ టచ్ ఈమూవీలో ఎక్కువగా ఉంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా కమర్షియల్ విలువలతో రూపొందుతున్న ఈమూవీ కథలో ‘శ్రీకృష్ణుడు కుచేలుడు’ కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. 

ఇప్పుడు ఈపాట విడుదలైన కొన్ని నిముషాలలోనే వైరల్ గా మారడంతో ‘మహర్షి’ విజయం పై నమ్మకాలు పెరుగుతున్నాయి. ఏ మూవీ విజయానికి అయినా ఆడియో సక్సస్ కీలకం కావడంతో ఈమూవీలోని మొదటి పాట హిట్ కావడం మహేష్ తో పాటు వంశీ పైడిపల్లికి కూడ జోష్ ను ఇచ్చే అంశం. ఈ సమ్మర్ కు ఒక్క మహేష్ సినిమా తప్ప మరే టాప్ హీరోల సినిమాలు పోటీగా లేకపోవడంతో ‘మహర్షి’ కి పాజిటివ్ టాక్ వస్తే అది కలక్షన్స్ సునామీగా మారుతుందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: