ఎన్ని వివాదాల నడుమున ఎట్టకేలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అయ్యింది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఏపీ హైకోర్ట్ స్టే కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం చిత్ర బృందం సుప్రీం కోర్టును ఆశ్రయించి ఏపీలో స్టే ఎత్తి వేయించేందుకు, సినిమా విడుదలకు మార్గం సుగమం చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా.. ఈ సినిమాలో ఏం చూపిస్తారు? ఏలాంటి వివాదాస్పద అంశాలు ఉండబోతున్నాయనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెన్నుపోటు అంశం, ఎన్టీఆర్ మీద ఆయన కుటుంబమే కుట్రలు చేసిందనే అంశాలు ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం రూపొందించారు. 


సినిమా మొదటి భాగం మొత్తం లక్ష్మీ పార్వతి, ఎన్టీ రామారావు మధ్య వచ్చే సీన్లతోనే సాగింది. తొలి భాగం ఏమంత ఆకట్టుకునే విధంగా లేదని, స్క్రీన్ ప్లే కాస్త బోరింగ్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మూవీ సెకండాఫ్ వచ్చేసరికి వెన్నుపోటు ఎపిసోడ్ ప్రధానంగా చూపించారు. ఈ సీన్ల సీక్వెన్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచే విధంగా డిజైన్ చేశారు. సినిమా క్లైమాక్స్ ఎక్కువగా ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయం గురించి చర్చిస్తూ.. సెంటిమెంట్ డోసుతో ఒళ్ళు గగుర్పాటయ్యేలా తెరకెక్కించారు.


ఇక ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిని చాలా మంచి వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేశారు. ఆమె అసలు పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లోకానీ, గవర్నమెంటుకు సంబంధించి వ్యవహారాల్లో కానీ ఇన్వాల్వ్ కాలేదనే విధంగా చూపించారు. ఆమెపై వచ్చినవి అన్నీ కేవలం నిందలే అనే విధంగా ఫోకస్ చేశారు. ఎన్టీఆర్‌కు అన్యాయం జరుగడానికి ప్రధాన కారకులు ఆయన కుటుంబ సభ్యులే అనేది ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం రూపొందించారు.రాజకీయాల పరంగా చూస్తే... ఈ చిత్రం కొందరికి నష్టం కలిగించే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: