ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటిక మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర..నేడు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అయ్యింది.  ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఉద్యమ సింహం’థియేటర్లోకి రాబోతుంది.  అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఓటర్లపై ప్రభావం పడుతుందని ఆంధ్రప్రదేశ్ లో వచ్చేనెల 3వ తారీఖు వాయిదా వేసిన విషయం తెలిసిందే.  తాజాగా ‘ఉద్యమ సింహం’ రిలీజ్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు  స్పందించారు. 
Image result for udyama simham
ఆయన మాట్లాడుతూ.. ‘ఉద్యమ సింహం’ చిత్రం ఓటర్లపై ప్రభావం పడే అవకాశం ఉందని..ఈ చిత్రం విడుదలను వచ్చే నెల 11 వరకూ నిలిపివేయాలని కోరుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాకు వినతిపత్రం అందజేశారు.  ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

త్వరలో  లోక్ సభ ఎన్నికల్లో జరగబోతున్న నేపథ్యంలో  వి.హనుమంతరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాదు జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందనీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: