వరస విజయాలతో దూసుకుపోతున్న సమంత వచ్చే వారం విడుదల కాబోతున్న 'మజిలీ' సినిమా రిజల్ట్ గురించి చాల ఆశక్తిగా ఎదురు చూస్తోంది. 'మజిలీ' విడుదల కాకుండానే ఈరోజు తమళనాడులో సమంత నటించిన 'సూపర్ డీలక్స్' మూవీ విడుదలైంది. ఈమూవీకి మొదటిరోజు మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ రావడంతో సమంత మంచి జోష్ మీద ఉంది. 

ఈసినిమాలో సమంత ఒక వివాహిత స్త్రీగా కనిపిస్తూ మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తన భర్తను హత్యా చేసే నెగిటివ్ పాత్రలో నటించింది. ఈ పాత్రలో ఆమె నటించిన తీరుకు కోలీవుడ్ మీడియా ప్రశంసలు కురిపిస్తూ ఒక విచిత్రమైన కామెంట్ చేసింది. 

సమంత ఈసినిమాతో ఇండస్ట్రీ నుండి రిటైర్ అవ్వడం మంచిది అంటూ కోలీవుడ్ మీడియా కామెంట్స్ వ్రాసింది. అయితే ఈ కామెంట్స్ సమంత దృష్టి వరకు వెళ్ళడంతో కోలీవుడ్ మీడియా తనను ప్రశంసిస్తోందా లేక విమర్శలు చేస్తోందా అంటూ తన ఆశ్చర్యాన్ని తెలియచేస్తూ ట్విట్ చేసింది. 

ఇప్పుడు ఆ ట్విట్ వైరల్ కావడంతో సమంత సందేహాల పై చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈమూవీని తెలుగులో కూడ డబ్ చేసి త్వరలో విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా భర్తకు విషం ఇచ్చి చంపే సీన్ లో సమంత నటన అద్భుతం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీలో సమంత నటనకు అవార్డులు కూడ వస్తాయి అని అంటున్నారు. మరి అంత సమర్థత ఉన్న సమంతను వెంటనే రిటైర్ అవ్వమని కోలీవుడ్ మీడియా ఎందుకు సెటైర్ వేసిందో సమాధానం లేని ప్రశ్న.. 


మరింత సమాచారం తెలుసుకోండి: