సాధారణంగా మన ఇంటి ఆవరణలో ఏదైనా మురుగు కాల్వ ఉంటే..మున్సిపాలిటీ వారు రావాలి..అది శుభ్రం చేయాలనే తీరులో ఉంటాం. ఆ మురుగు కాల్వ దుర్వాసన వెదజల్లుతున్నా..శుభ్రం చేయాలనే ఆలోచన కొంతమందికి రాదు..కానీ ఓ సినీ తార అయి ఉండి..మురుగు కాల్వ మొత్తం చెత్తగా ఉండటంతో... స్వయంగా చీపురు పట్టి మురుగు కాల్వలోని చెత్తను శుభ్రం చేశారు. వివరాల్లోకి వెళితే.. అమల నిజామాబాద్ జిల్లా బోధన్ లోని ఖండ్ గాంలో ఓ శుభకార్యక్రమానికి హజరయ్యారు. గ్రామంలో కార్యక్రమం పూర్తయిన తర్వాత స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. 

మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అమల అక్కడున్న మురుగు కాల్వ మొత్తం చెత్తగా ఉండటంతో చాలా బాదపడ్డారు.  మన పని ఎవరో వచ్చి చేస్తారని..ఎదురు చూసి రోగాలు వ్యాపించేలా చేయడం పొరపాటని.. స్వయంగా చీపురు పట్టి మురుగు కాల్వలోని చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా అమల చేతికి గ్లోవ్స్ కూడా వేసుకోకుండా... ఎంతో చిత్తశుద్ధితో ఆ పనిని పూర్తి చేశారు. 

అమల చేసిన ఆ పనిచూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ..మన చుట్టు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అపరిశుభ్రత ఉన్న దాన్ని బాగు చేసుకోవాలసిన బాధ్యత అందరిపై ఉంటుందని..ఎవరి గ్రామాన్ని వారే శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: