2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో అధికారంలోకి దూరమవడంతో రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగినా సమయంలో 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎక్కడా కూడా ప్రచారం చేయలేదు జూనియర్ ఎన్టీఆర్.

‘RRR’ కొత్త షెడ్యూల్ షురూ.. ఎన్నికల ప్రచారం తప్పించుకోడానికేనా..?

అయితే తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లైట్ టికెట్స్ సోషల్ మీడియాలో పెట్టి సంచలనం సృష్టించారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఇంతకీ విషయం ఏమిటంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఉత్తర భారతంలో వడోదరలో జరుగుతున్నట్లు ఇందుకోసం సినిమా షూటింగ్లో బిజీగా రాబోయే రోజుల్లో ఏప్రిల్ 11 వరకు ఉండనున్నట్లు పేర్కొన్నాడు ఎన్టీఆర్.

Image result for rrr movie

అయితే ఇదంతా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటానికి ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ చేశారని..ఎక్కడా తన కెరియర్ రాజకీయాల్లోకి తీసుకు వెళ్లి పాడు చేస్తారోనని ముందే ఎన్టీఆర్ ఈ విధంగా తెలివిగా వ్యవహరించారని కొంతమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: