పిజ్జా సినిమా సక్సెస్ తర్వాత విజయ్ సేతుపతి వరుస విజయాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.  హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.  ఆ మద్య రజినీకాంత్ నటించిన పెట్టా, మణిరత్నం తీసిన నవాబ్ సినిమాలో కీలక పాత్రల్లో నటించాడు.  అంతే కాదు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి ’సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.  సినిమా కథ నచ్చితే..ప్రాధాన్యత ఉంటే కీలకమైన పాత్రల్లో నటించడానికి ఇష్టపడుతున్నాడు విజయ్ సేతుపతి.

ఇలా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.  ఇప్పుడిప్పుడే హీరోగా మంచి పొజీషన్ లోకి వస్తున్న సమయంలో హిజ్రా పాత్రల్లో నటించడం అంటే చాలా కష్టం..ఆ మద్య లారెస్స్ తీసిన కాంచన సినిమాలో శరత్ కుమార్..కన్నడంలో సాయికుమార్ ఎంతో అద్భుతంగా నటించారు.  అలాంటి పాత్రలు సాహసంగానే భావిస్తారు.  అలాంటి సాహసాన్ని విజయ్ సేతుపతి చాలా తేలికగా చేసేశాడు. ఆయన హిజ్రా పాత్రను పోషించిన 'సూపర్ డీలక్స్' మూవీ ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 హిజ్రా పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడని అంటున్నారు.  విజయ్ సేతుపతి నటనకు విమర్శకులు కూడా ప్రశంసించారు. విజయ్ సేతుపతి కెరియర్లో ఈ పాత్ర చెప్పుకోదగినదిగా నిలిచిపోవడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే విజయ్ సేతుపతి ఖాతాలో మరో హిట్ చేరిపోయినట్టేనని అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: