తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు రాజకీయ జీవితాన్ని ఆధారంగా మెయిన్ లైన్ తీసుకుని రామారావు గారి జీవితంలో ఆయన భార్య లక్ష్మీపార్వతి ప్రవేశించాక ఎటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి...రాజకీయంగా, కుటుంబపరంగా మరియు వ్యక్తిగతంగా బయట ప్రపంచానికి తెలియనివి అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తాజాగా విడుదలైంది.

Related image

ఒక ఆంధ్ర రాష్ట్రం మినహా ఎన్నో ఆటంకాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఈ సినిమాలో చంద్రబాబు ఏ విధంగా రామారావుని మానసిక క్షోభకు గురి చూశారు వంటి విషయాలను వెండితెరపై అద్భుతంగా చూపించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. రాజకీయంగా చంద్రబాబు ఏ విధమైన ఆలోచనలు కలిగి ప్రత్యర్థులను మట్టుబెడతారో..ప్లాన్లను వెండితెరపై సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రాంగోపాల్ వర్మ చూపించారు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో.

Image result for lakshmis ntr

అసెంబ్లీ సన్నివేశాలలో తన పార్టీకి సంబంధించిన వారు వ్యతిరేకంగా రామారావు గారిపై తిరగపడటాన్ని అద్భుతంగా వెండి తెరపై ఆవిష్కరించాడు రాంగోపాల్ వర్మ . మొత్తం మీద ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటూ రామారావు గారి చివరి క్షణాలలో చాలా మానసిక క్షోభ అనుభవించారు అని కామెంట్ చేస్తున్నారు. చాలా దుర్మార్గుల మధ్య ఎన్టీ రామారావు గారి జీవించారని బోరుమంటున్నరు.



మరింత సమాచారం తెలుసుకోండి: