సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోతుంది. అయితే ఈ సినిమా బిజినెస్ తెలుగు రెండు రాష్ట్రాల్లో బాగానే చేస్తున్నా ఓవర్సీస్ లో మాత్రం కొనేవారు లేరని తెలుస్తుంది. అదేంటి మహేష్ సినిమాకు బిజినెస్ సమస్యలా అని ఆశ్చర్యపోవచ్చు.


ఈమధ్య ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు భారీ లాసులు తెచ్చిపెడుతున్నాయి. రాం చరణ్ వినయ విధేయ రామ అయితే కేవలం కోటిన్నర వసూళ్లతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు దిమ్మ తిరిగేలా చేసింది. అందుకే మహర్షి విషయంలో వారు వెనుకడుగు వేస్తున్నారు. నిర్మాతలు 18 కోట్లు కోట్ చేయగా 12 కోట్ల దాకా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారట.


12 కోట్ల వరకైతే ఓకే కాని అంతకుమించి అంటే మా వల్ల కాదని అంటున్నారట. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ డైలమాలో ఉంది. మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.


దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి మొదటి పాట శుక్రవారం రిలీజైంది. మహేష్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్న మహర్షి సినిమా మహేష్ 25వ సినిమాగా రాబోతుంది. నిర్మాతల్లో ఒకడైన దిల్ రాజు ఈ సినిమా రిజల్ట్ మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడు. మరి మహేష్ మహర్షి ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: