టాలీవుడ్ లో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటుడు నందమూరి తారక రామారావు.  ఆయన నటించని పాత్రలు లేవు..రాముడు, కృష్ణుడు పాత్రల్లో నిజంగా దేవుడు అంటే ఇలాగే ఉంటారేమో అనే విధంగా కనిపించే వారు.  రావణ బ్రహ్మా, దుర్యోదను లాంటి నెగిటీవ్ పాత్రల్లో కూడా తన విశ్వరూపాన్ని చూపించారు.  అలాంటి రామారావు రాజకీయాల్లోకి రావడం  తెలుగు దేశం పార్టీ స్థాపించడం ముఖ్యమంత్రి పదవి అలంకరించడం జరిగిపోయాయి.  కానీ ఆయన చివరి జీవితంలో మాత్రం కష్టాలు..కన్నీళ్లు తప్పలేదు. 

నమ్మినవారే దారుణంగా వెన్నుపోటు పొడవడంతో ఎన్టీఆర్ కృంగిపోయారు.  ఇటీవల ఆయన జీవితంపై ఎన్టీఆర్ బయోపిక్ రూపొందిన విషయం తెలిసిందే. క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ తీశారు.  కానీ తెలుగు ప్రజలు ఆ సినిమాలు పెద్దగా ఆదరించలేదు.  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్టీరామారావుకు 1995లో చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి నుంచి తొలగించి ఆయన అధికారం చేజిక్కించుకోవడం ఇతివృత్తంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను తీశారు. 

కుట్రతో మరుగు పరిచిన నిజాలను ప్రజలకు చెప్పేందుకు ఈ సినిమా నిర్మించడంతో అధికార పార్టీ నాయకులకు గుండెల్లో వణుకు మొదలైంది.  ఎన్ని రకాలుగా ఆపాలో అన్ని రకాలుగా ఆపే ప్రయత్నం చేశారు..చివరికి ఈసీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3న విడుదల కాబోతుంది ఈ సినిమా. అయితే రాంగోపాల్ వర్మ చెప్పినట్లు 29 ఖచ్చితంగా రిలీజ్ చేస్తానని చెప్పారు..ఈ నేపథ్యంలో ఒక ఏపిలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగులు, పాత్రధారుల గురించి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది. 

ఆనాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోవడంలో టీడీపీ మీడియా చంద్రబాబుకు ఎంతగా సహకరించిందో తమకు అర్థమైంది  అంటున్నారు.  ఈ సినిమా చూసి ఏపీలో సినిమా రిలీజ్‌ కాలేదని బాధపడొద్దు ఆంధ్రా బ్రదర్స్‌.. తెలంగాణాకు రండి..ఎన్టీఆర్ జీవితం చివర్లో ఎంత నరకం అనుభవించారు..కాదు..ఆయనకు చూపించారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది..అది అందరూ తెలుసుకోవాలి..  చంద్రబాబు నైజం ఏమిటో తెలుసుకోండి అంటూ ప్రేక్షకులు ముక్త కంఠంతో అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: