టాప్ హీరోలతో దర్శకులు సినిమాలు తీస్తున్నప్పుడు కథను హీరో చుట్టూనే తిప్పుతారు. అవసరం ఉన్నా లేకున్నా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా సీన్స్ క్రియేట్ చేస్తారు. అయితే ఈపద్దతికి దర్శకుడు వంశీ పైడిపల్లి చెక్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముగ్గురు స్నేహితుల మధ్య తిరగే ‘మహర్షి’ కథలో పేరుకు అల్లరి నరేశ్ ప్రత్యేక పాత్ర అయినప్పటికీ కథ అంతా నరేశ్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. 

ముఖ్యంగా బాగా చదువుకుని కూడ విదేశాలకు వెళ్ళకుండా వ్యవసాయం పట్ల అభిమానంతో తన సొంత ఊరులో రైతుగా ఉండిపోయిన నరేశ్ వ్యవసాయంలో నష్టపోయిన రైతు పాత్రలో అద్భుతంగా నటించాడు అని ఈమూవీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసినవాళ్ళు చెబుతున్నారు. అంతేకాదు ఈమూవీలో నరేశ్ పాత్ర చిన్నదే అయినా హీరో స్థాయిలో ఎలివేట్ కాబడింది అని టాక్. 

వాస్తవానికి కామెడీ హీరోగా పేరు గాంచిన నరేశ్ మానసిక సంఘర్షణలతో కూడిన పాత్రలను అద్భుతంగా చేయగలడు అన్న విషయం ఈమూవీ విడుదల అయ్యాక అందరికీ తెలిసి వచ్చేలా అవుతుంది అంటున్నారు. దీనికితోడు నరేశ్ పాత్ర చిన్నది అయినప్పటికీ కథ రీత్యా అతడి పాత్ర పరిధిని ఎక్కడా తన పాత్ర కోసం తగ్గించవద్దు అనీ మహేష్ చెప్పడంతో వంశీ పైడిపల్లి నరేశ్ నటనా విశ్వరూపాన్ని ఈమూవీలో చూపెడుతున్నట్లు సమాచారం.

నరేశ్ తండ్రి దర్శకుడు ఈవివి సత్యనారాయణ ఆయన ఉన్నంతకాలం ప్రతి సమ్మర్ కు తప్పనిసరిగా నరేశ్ కు ఒక హిట్ ఇచ్చేవాడు. అయితే ఆయన చనిపోయాక నరేశ్ కెరియర్ అయోమయంలో పడిపోయి తనకు పనికి వచ్చే కథలు ఏమిటో కూడ ఎంచుకోలేని అయోమయంలోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈ సమ్మర్ కు ‘మహర్షి’ నరేశ్ కు పెద్ద బ్రేక్ ఇవ్వబోతోంది అన్న ప్రచారం జరగబోతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: