చంద్రబాబుని లక్ష్మీస్ ఎన్టీఆర్’  వెంటాడుతోంది. ఏపీలో ఆ మూవీ రిలీజ్ కాకపోయినా ఇపుడు సోషల్ మీడియాలో కొన్ని సీన్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో ఏముందో అన్న ఆత్రుత ఓ వైపు ఏపీ జనంలో పెరిగిపోతోంది. ఇదే పెట్టుబడిగా రామ్ గోపాల్ వర్మ  ఇక్కడ ధియేటర్లలో కూడా తెచ్చేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారట.


ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఇది ఎవరికీ తెలియని కధ కాదు. అందరికీ తెలిసిందే. అన్న నందమూరి అధికారం ఎలా పోగొట్టుకున్నారో ఏపీ జనాలకు తెలియదనుకుంటే పొరపాటే. ఇక 1995 ఎపిసోడ్ లో చంద్రబాబు పాత్ర ఏంటి అన్నది కూడా అంతా బాగా తెలుసుకున్నదే. బాబుకు వెన్నుపోటు అన్న బిరుదు కూడా ఉంది. ఇన్నీ తెలిసి కూడా ప్రజలు బాబుకు ఇప్పటికి రెండు సార్లు సీఎం గా అధికారం కట్టబెట్టారు. మరి అన్నీ తెలిసిన విషయాలనే  వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్’  లో చూపిస్తే బాబు అండ్ కో కి భయమెందుకు.


ఎవరో టీడీపీ అభిమాని ఈ సినిమాను ఆపేయమని కోర్టుకు వెళ్ళినా ఆ పాపం బాబుకే చుట్టుకుంటోంది. నిజానికి ఈ మూవీని ఏపీలో కూడా నిన్న రిలీజ్ చేసి ఉంటే ఏ గొడవా లేకుండా పోయేది. ఇపుడు బాబు నెత్తిన అంటకట్టుకున్నారు. రేపటి రోజున ఈ మూవీ ఏపీలో ఎలాగూ రిలీజ్ కాక మానదు. అపుడు ఆ మూవీని చూసిన వారంతా ఇందుకా చంద్రబాబు అడ్డుకున్నది అని అనుకుంటారు. అంటే అనవసరంగా బాబు భుజాలు తడుముకున్నారనిపిస్తోంది. ఏది ఏమైనా లక్ష్మీస్ ఎన్టీఆర్’  బాబుకు ఈ ఎన్నికల వరకూ ఓ మైనస్సే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: