తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు రాజకీయ జీవితం ఆధారం చేసుకుని సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇప్పుడు తెలుగు రాజకీయాలలోనూ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పెద్ద హాట్ టాపిక్ అయింది. తాజాగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Image result for lakshmis ntr

నందమూరి తారకరామారావు గారి జీవితంలో లక్ష్మీపార్వతి ఒక అభిమానిగా ఆయన బయోగ్రఫీ ను రాస్తాను అంటూ ఎన్టీఆర్ జీవితంలో మరియు ఆయన ఇంటిలో ప్రవేశించి ఏ విధంగా ఎన్టీఆర్ కి బాగా దగ్గర అవుతుందో వంటి విషయాలను వెండితెరపై చూపిస్తుంది రాజకీయంగాను మరియు కుటుంబ పరంగా చోటు చేసుకున్న సంఘటనలు రెండు తెరపై అద్భుతంగా చూపించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

Image result for lakshmis ntr

ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్ లో కళ్ళుచెదిరే కలెక్షన్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఓవ‌ర్సీస్ లో ఈ సినిమా 1 మిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల క్ల‌బ్ లో చేరేందుకు ఇంకెంతో దూరంలో లేదు. అమెరికాలో ఏకంగా 118 లొకేష‌న్ల‌లో రిలీజైన ఈ చిత్రం ఇప్ప‌టికే $90,215 డాల‌ర్లు వ‌సూలు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అంటూ ఒక మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో చేరేందుకు కూత‌వేటు దూరంలో మాత్ర‌మే ఉంది. బ‌యోపిక్ కేట‌గిరీలో ఇది పెద్ద విజ‌య‌మే. ఆర్జీవీ కెరీర్ బెస్ట్ రికార్డ్ ఇద‌ని చెబుతున్నారు సినిమా విశ్లేషకులు. మొత్తంమీద ఓవర్సీస్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: