‘కథానాయకుడు’ ‘మహానాయుకు’ సినిమాల కోసం బాలకృష్ణ ఎంతో కష్టపడి నటించినా పట్టించుకోని సగటు ప్రేక్షకులు నిన్న విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో బాలకృష్ణ పాత్రలో కనిపిస్తున్న ఒక చిన్న నటుడుకి ఆమూవీ చూస్తున్న ప్రేక్షకులు ఈలలు వేస్తూ గోల చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈసినిమాలో రామ్ గోపాల్ వర్మ నందమూరి కుటుంబ సభ్యుల పేర్లను డైరెక్ట్ గా ప్రస్తావించకపోయినా ఇన్ డైరెక్ట్ గా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ బాడీ లాంగ్వేజ్ ని తన సినిమాలో నటించే పాత్రల ద్వారా చూపెట్టాడు. 

ముఖ్యంగా ఈమూవీలో బాలకృష్ణ పాత్ర పెద్దదిగా లేకపోయినా చంద్రబాబు నాయుడు పాత్ర ఏం చేసినా దానికి మద్దతు ఇవ్వడం తప్ప అంతకు మించిన పరిధి లేకుండా బాలయ్య పాత్రను వర్మ డిజైన్ చేసాడు. బాలయ్యపాత్ర చేసిన యాక్టర్ అచ్చు బాలకృష్ణ రూపుతో కనిపించే విధంగా వర్మ డిజైన్ చేయడంతో పాటు బాలయ్య పాత్ర చెప్పే కొద్ది డైలాగులు బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ తో చెప్పడంతో ఆ డైలాగ్స్ కు ప్రేక్షకులు తెగ నవ్వుతున్నారు. 

దీనికితోడు ఈమూవీ ప్రారంభంలో వర్మ ఈసినిమా విషయంలో బాలకృష్ణ కృతజ్ఞతలు తెలపడం చూసి ప్రేక్షకులు కామిడిగా ఫీల్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈమూవీ ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకపోయినా ఈసినిమాకు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కోట్లు కలక్షన్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈమూవీకి కలక్షన్స్ ప్రీమియర్ షోల విషయంలో బాగా రావడమే కాకుండా సుమారు ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రేంజ్ కి రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకపోవడంతో ఈమూవీ తాలూకు వీడియో క్లిప్పింగ్స్ ని ఈసినిమా చూసినవారు ఆంధ్రప్రదేశ్ లోని తమ సన్నిహితులకు షేర్ చేస్తున్న నేపధ్యంలో రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు అందరూ కలిసే ఉన్నారు అన్న విషయాన్ని మరొకసారి రుజువు చేస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: