సూపర్ స్టార్ మహేష్ తో వన్ నేనొక్కడినే తీసి ఘోర పరాజయాన్ని అందుకున్న టాలీవుడ్ వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్, ఆ తరువాత ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకు వచ్చాడు. ఇక ఆ తరువాత గత ఏడాది రాంచరణ్, సమంతల కలయికలో 1980ల నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన రంగస్థలం సినిమా ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అదే సమయంలో మహేశ్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ భరత్ అనే నేను కూడా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, రంగస్థలం మూవీ లోని కథ, కథనాలు, ఆర్టిస్టుల సహజ నటన, వెరసి ఆడియన్స్ అందించిన సూపర్ డూపర్ కలెక్షన్స్ ముందు భరత్ అనే నేను కొంత తలవంచిందనే చెప్పాలి. 


ఇక అధివరకు చరణ్ ఖాతాలో మగధీర వంటి సూపర్ హిట్ ఉన్నప్పటికీ, ఆయన నటన మరియు పాత్రలోని సహజత్వం, చరణ్ కు మళ్ళీ అంతటి విజయాన్ని అందించిందనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో చరణ్, చెవిటివాడైన సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నాడు అని చెప్పడం కంటే జీవించాడు అని చెప్పవచ్చు. నిజానికి అప్పటివరకు చరణ్ కు నటన పరంగా కొందరి నుండి వెలువడిన విమర్శలన్నిటికీ ఈ సినిమా ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పాలి. 


ఇక సమంత, జగపతి బాబు, ఆది, నరేష్, అనసూయ కూడా తమ ఆకట్టుకునే నటనతో సినిమాకు మరింత వన్నె తెచ్చారు. ఇక ఈ సినిమాకు నేటితో ఏడాది పూర్తి అవడంతో మెగా ఫ్యాన్స్, సోషల్ మీడియా మాధ్యమాల్లో రంగస్థలం హ్యాష్ ట్యాగ్ తో  తెగ వైరల్ చేస్తూ, గతేడాది చిట్టిబాబుగా తమ ముందుకు వచ్చిన చరణ్, రాబోయే రోజుల్లో మరిన్ని విజయవంతమైన సినిమాల్లో నటించాలని కోరుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: