టాలీవుడ్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’మొత్తానికి నిన్న విడుదలైంది.  అయితే ఈ మూవీ ఏపిలో తప్ప అన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది.  ఏపిలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ మూవీ ఏప్రిల్ 3 న రిలీజ్ చేసేందుకు సిద్దం అవుతున్నారు చిత్ర యూనిట్.  మొదటి నుంచి ఈ సినిమాపై ఎన్నో విమర్శలు వస్తూన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు క్యారెక్టర్ ఈ  మూవీలో నెగిటీవ్ గా చిత్రీకరించారని టీడీపీ శ్రేణులు కోర్టు మెట్లెక్కారు. కానీ సినిమా విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు తెలిపింది.

ఈ సినిమాకు ‘యూ’సర్టిఫికెట్ రావడం మరో విశేషం. అయితే ఈ సినిమా ఏపిలో రిలీజ్ కాకపోవడంతో పలువురు నేతలు తెలంగాణ, కర్ణాటకకు వెళ్లి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.  ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఏపి ప్రజల్లో మరింత క్యూరియాసిటి పెరిగిపోయింది.  ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తామా అని ఏపి ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారుట.  తాజాగా టీడీపీ అంటేనే భగ్గుమనే రీతిలో ఫైర్ అయ్యే సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్  లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ వీక్షించారట.

ఈ విషయాన్ని ఈ మూవీకి  గీత రచయితగా పనిచేసిన సిరాశ్రీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. మెస్కో అధినేత విజయ్ కుమార్ తో కలిసి ఉండవల్లి... లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూశారని సిరా శ్రీ తెలిపారు.  ఈ సినిమా పై ఇప్పటి వరకు నేతలు పెదవి విప్పడం లేదు. త్వరలో ఉండవల్లి నుంచి ఈ సినిమాపై అదిరిపోయే కామెంట్ రావడం మాత్రం ఖాయమనే చెప్పాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: